దరిలేని లాక్ డౌన్…దూరమైన సొంతూరు!

  కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలుపరుస్తున్నారు. దీంతో వివిధ ప్రాంతాలల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పని లేక పరాయి పంచన ఉండలేక, వారు సొంతూళ్లకు వెళ్లే మార్గంలేక సతమతమై పోతున్నారు. లాక్ డౌన్ ని మొదట 21 రోజులన్నారు ఆ తర్వాత మరో 19 రోజులు పెంచి మే 3 వరకు లాక్ డౌన్ విధించారు. మరళా లాక్ డౌన్ ని పొడిగించే సూచనలు కనిపించడంతో […]

Written By: Neelambaram, Updated On : April 29, 2020 5:21 pm
Follow us on

 

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలుపరుస్తున్నారు. దీంతో వివిధ ప్రాంతాలల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పని లేక పరాయి పంచన ఉండలేక, వారు సొంతూళ్లకు వెళ్లే మార్గంలేక సతమతమై పోతున్నారు. లాక్ డౌన్ ని మొదట 21 రోజులన్నారు ఆ తర్వాత మరో 19 రోజులు పెంచి మే 3 వరకు లాక్ డౌన్ విధించారు. మరళా లాక్ డౌన్ ని పొడిగించే సూచనలు కనిపించడంతో కార్మికులు సొంతూరు వెళ్లేందుకు ధర్నాలు, ఆందోళనలు చేబడుతున్నారు. తమను సొంతూళ్లకు పంపించాలని లాక్ డౌన్ నియమాలను ఉల్లంగిస్తూ.. రోడ్లెక్కి ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. ఈ రోజు కూడా ఐఐటీ హైదరాబాద్ భనవనాల వద్ద సుమారు 1600మంది కార్మికులు ఆందోళనకు దిగారు.

ఆయా సందర్భాలలో వలస కూలీల అవస్థలు

మల్కాజిగిరి లోని సఫీల్ గూడ లో జైన్ కనెస్ట్రక్షన్స్ వద్ద బీహార్, యూపీ, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్‌ కు చెందిన సుమారు 500మంది ధర్నాకు దిగారు. తమకు గత 15 రోజులుగా ఎవరు పట్టించుకోవడంలేదని, కనీసం తాగడానికి నీళ్లివ్వడం లేదని వారు వాపోయారు. తమ కాంట్రాక్టర్లు గాని ప్రభుత్వం కానీ తమకు ఎటువంటి సహాయం చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారంతా సఫీల్ గూడ రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగారు. వెంటనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని లేకపోతే తమ రాష్ట్రాలకు తరలించాలని వేడుకుంటున్నారు. తమకు ఎక్కడా సోషల్ డిస్టెన్స్ లేదని ఒక్కొక్క గదిలో 10 మందిని ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చందానగర్‌ నుంచి మధ్యప్రదేశ్‌ కు దాదాపు వందమంది డీసీఎం వ్యాన్‌ లో బయల్దేరగా బాచుపల్లి చౌరస్తా వద్ద పోలీసు తనిఖీల్లో పట్టుబడ్డారు. అలాగే గచ్చిబౌలి నుంచి 200 మంది కాలినడకన బయల్దేరితే రేతిబౌలి వద్ద పోలీసులు నిలువరించి వెనక్కి పంపారు. టోలిచౌకి నుంచి మధ్యప్రదేశ్‌ కే బయల్దేరిన మరో యాభై మందికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. నగరంలోనే ఇలా దాదాపు వేయి మంది ఊరెళ్లిపోవడానికి పరిపరి విధాల ప్రయత్నించారు.  తమ రాష్ట్రాలకు పంపించేందుకు అనువైన ఏర్పాట్లు చేయాలంటూ వారు వేడుకున్నారు.

సుమారు 200 మంది వలసకూలీలు సొంతూళ్లకు వెళ్లాలని హైదరాబాద్‌ లో మూటాముల్లె సర్దుకొని, చంటి పిల్లలను ఎత్తుకొని నడుచుకుంటూ బయలుదేరారు. హబ్సిగూడ జెన్‌ పాక్‌ ప్రాంతంలోని పోలీసు తనిఖీ కేంద్రం దగ్గర అడ్డుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా వెంటనే అక్కడికి చేర్చుకుని వారిని సుముదాయించారు.

హైదరాబాద్ శివారులోని నానక్ రాంగూడ ప్రాంతంలో ఒక్క చోటే 1200 నుంచి 1500 మంది వరకు వలస కార్మికులు కనిపించారు. ‘మా ఆరోగ్యం గురించి పట్టించుకొనేవారు కూడా లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో వేల సంఖ్యాలో.. దేశం మొత్తం మీద లక్షల సంఖ్యలో వలస కూలీలా బాధలు వర్ణణాతీతం. వారిని సొంతూళ్లకి పంపిసచే ఏర్పాట్లు చేస్తే మంచిదని అనేకమంది విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

దేశమంతా లాక్‌ డౌన్‌ తో స్తంభించిన వేళ.. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లినా.. ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. కార్మికుల బాగోగులు చూసుకోవాలని భవన నిర్మాణ సంస్థలు, పలు కంపెనీలకు ఆదేశాలు జారీ చేసాం. ప్రభుత్వ, పోలీస్ శాఖ ఆదేశాలను కార్మిక సంస్థలు, భవన నిర్మాణ సంస్థలు బేఖాతర్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’అని కమిషనర్‌ పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా అమలు చేసిన లాక్ డౌన్ కారణంగా వలస కార్మికుల జీనోపాధికి సంబంధించిన సమస్యలు మరియు వారికి సంబంధిచిన ఇతర సమస్యలు పరిష్కరించడానికి దేశవ్యాప్తంగా 20 కంట్రోల్ రూములను ఏర్పాటు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.