దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో లాక్ డౌన్1.0, 21 రోజులు, లాక్ డౌన్ 2.0 19 రోజులు అమలుపరచగా తాజాగా మరో రెండు వారాలపాటు మే 17వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ లాక్ డౌన్ 3.0 లో అనేకమైన పనులకు సడలింపులు ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ క్రింద ఇవ్వబడిన పనులకు నిబంధనలు వర్తిస్తాయి.
- విమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాల నిషేధం
- స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు బంద్
- హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు బంద్
- స్విమ్మింగ్ పూల్స్, స్టేడియంలు మూసి ఉంచాలి
- అన్ని ప్రార్థనా స్థలాలు, పబ్లిక్ ఈవెంట్లు రద్దు
- అన్ని జోన్లలో ఆస్పత్రులలో ఓపీ సేవలకు అనుమతి
- గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో కొన్ని ఆంక్షలు సడలింపు
- రాత్రి 7గం.ల నుంచి ఉ.7గంటల వరకు కర్ఫ్యూ అమలు
- వారానికి ఒకసారి రెడ్ జోన్లలో పరిస్థితి పరిశీలన
- కేసులు తగ్గితే రెడ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మార్పు
- గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సాధారణ కార్యకలపాలకు అనుమతి
- గ్రీన్ జోన్లలో ఉ.7 నుంచి సా.7వరకు వ్యాపారాలకు అనుమతి
- ఆరెంజ్ జోన్లలో వ్యక్తిగత వాహనాలకు అనుమతి
- ఆరెంజ్ జోన్లు: కార్లలో ఇద్దరు ప్యాసింజర్లకు అనుమతి
- ఆరెంజ్ జోన్లు: టూ వీలర్ మీద ఒక్కరికే అనుమతి
- ఆరెంజ్, గ్రీన్ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు
- గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ప్రైవేట్ క్యాబ్‌లకు అనుమతి
- వ్యవసాయ పనులన్నింటికీ అనుమతి
- రెడ్ జోన్లలో ఎలాంటి సడలింపులు లేవు
- 33 శాతం సిబ్బందితో ప్రైవేటు సంస్థలు పనిచేసేందుకు అనుమతి
- రాష్ట్రాల పరిధిలో బస్సులకు అనుమతిచ్చిన ప్రభుత్వం
- బస్సుల్లో సగం సీట్లలో మాత్రమే ప్రయాణాలకు అనుమతి
- గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఆన్ లైన్ షాపింగ్‌కు అనుమతి
- ప్రైవేట్ కార్యాలయాల్లో 33% వరకు సిబ్బంది హాజరుకు అనుమతి
- అన్ని రకాల గూడ్స్, కార్గో, ఖాళీ లారీలకు కూడా అనుమతి
- బహిరంగ ప్రదేశాల్లో ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాల్సిందే
- పెళ్లిళ్లకు అనుమతి, 50 మంది వరకు హాజరు కావొచ్చు
- అంత్యక్రియలకు 20 మంది వరకు హాజరయ్యేందుకు అనుమతి