
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయితీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల కు ఈ రోజు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండు దశల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి దశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, రెండు దశల్లో గ్రామ పంచాయితీ ఎన్నికలు జరుగనున్నాయి. మర్చి 9 నుంచి మర్చి 29 వరకు రెండు దశల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మొత్తం ఎన్నిక షెడ్యూల్ గ్రామీణ ప్రజలను కొంతమేర అయోమయానికి గురిచేస్తుంది.
అన్ని ఎన్నికలు రెండు మూడు రోజుల గ్యాప్ లోనే జరగడంతో కొంతవరకు గందరగోళ పరిస్థితి నెలకొన్నది. అదే విధంగా మార్చి 27న ఒకవైపు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మరోవైపు గ్రామ సర్పంచ్ ఎన్నికలు ఒకేరోజు జరుతున్నాయి. మధ్యలో మర్చి 26న నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అనివార్యమైతే అదేరోజు ఎన్నికలు జరగొచ్చు. ఇట్టి గందరగోళ పరిస్థితుల మధ్య స్వేచ్ఛగా, శాంతియుతంగా, నిష్పక్షపాతంగా ఈ ఆంధ్ర ఎన్నికలను అధికారులు ఎలా నిర్వహిస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి.
ఎన్నికల షెడ్యూల్ వివరాలు:
జెడ్పీటీసీ, ఎంపీటీసీ (పరిషత్) షెడ్యూల్ వివరాలు:
- నామినేషన్ల స్వీకరణ
మార్చి 9 నుంచీ 11 వరకు - ఎన్నికల పోలింగ్
మార్చి 21న - ఎన్నికల ఓట్ల లెక్కింపు (కౌంటింగ్)
మార్చి 24న
గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వివరాలు:
- నామినేషన్ల స్వీకరణ
మార్చి 17 నుంచీ 19 వరకు - ఎన్నికల పోలింగ్
మార్చి 27న మొదటిదశ
మార్చి 29న రెండోదశ
మార్చి 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్
మార్చి 27న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్