
2020 ఢిల్లీ ఎన్నికలలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను 62 సీట్లను ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకోగా, బీజేపీకి 8 స్థానాలు లభించిన విషయం తెలిసిందే.. దింతో రాంలీల మైదనంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడోవసారి ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్, అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. అటు పాలనా పరమైన విధానం, ఇటు రాజకీయ విధి విధానాలను తెలియజేసారు.
ఈ సందర్బంగా ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి.. “ఆప్ విజయం ప్రజల విజయం అని, ఢిల్లీ ప్రజల పుత్రునిగా మూడొవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నాని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ని సుందర నగరంగా తీర్చి దిద్దడానికి కేంద్రం అండదండలు కావాలని కోరారు. అలాగే బీజేపీ సహాయంతో ప్రజలకు మరింత సేవ చేయాలనీ ఉందని కేజ్రీవాల్ అన్నారు. దేశ రాజధానిలో పాలన సజావుగా సాగేందుకు ప్రధాని మోదీ ఆశీస్సులు కోరుతున్నానని అన్నారు.
ఎన్నికలు ముగిసాయి, ప్రజల తీర్పు వచ్చింది కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఢిల్లీ వాసులకు సేవ చేయాలనీ ఆశిస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ‘ఎన్నికల సమయంలో నాపై వివిధ పార్టీలు చేసిన విమర్శలకు సంబంధించి వాటిని క్షమించాను’ అని అన్నారు. తన పాలనలో ఎవరి పట్ల ఎలాంటి వివక్ష లేదని, అందరి అభివృద్ధి కోసం తాను కృషి చేశానని కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్ ప్రజలను ప్రేమిస్తాడు. ఉచితంగానే ఆ ప్రేమను పంచుతాడు’ అని ఉచిత సేవలపై పలు రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు.
ఈ విధంగా అటు ప్రజల మన్నలను పొందుకున్నారు, ఇటు బీజేపీని సున్నితంగా విమర్శించేస్తూ.. అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు ఢిల్లీ కొత్త సీఎం కేజ్రీవాల్.