పంచనామా ప్రకటనతో.. ఏపీ రాజకీయాలు రొచ్చు రొచ్చు!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్‌ తో పాటు ఆ వ్యక్తికి చెందిన మరికొందరు బినామీల ఇళ్లపైనా ఈ నెల 6 నుండి 10 వరకు 40 చోట్ల జరిగిన దాడుల్లో రూ 2,000 కోట్ల మేర లెక్కల్లో చూపని అవాదేవీలను గుర్తించామని ఆదాయపన్ను అధికారులు ప్రకటించగానే ఏముంది చంద్రబాబు దొరికిపోయారు అంటూ వైసిపి నేతలు విమర్శలు ప్రారంభించారు. పిఎ వద్దనే అంత మొత్తం దొరికితే, ఇక చంద్రబాబు, ఆయన కుమారుడు […]

Written By: Neelambaram, Updated On : February 18, 2020 2:11 pm
Follow us on

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్‌ తో పాటు ఆ వ్యక్తికి చెందిన మరికొందరు బినామీల ఇళ్లపైనా ఈ నెల 6 నుండి 10 వరకు 40 చోట్ల జరిగిన దాడుల్లో రూ 2,000 కోట్ల మేర లెక్కల్లో చూపని అవాదేవీలను గుర్తించామని ఆదాయపన్ను అధికారులు ప్రకటించగానే ఏముంది చంద్రబాబు దొరికిపోయారు అంటూ వైసిపి నేతలు విమర్శలు ప్రారంభించారు.

పిఎ వద్దనే అంత మొత్తం దొరికితే, ఇక చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లపై దాడులు జరిపితే మరిన్ని మొత్తలు దొరుకుతావో అంటూ ప్రకటనలు జారీ చేశారు. వారిద్దరిని అరెస్ట్ చేసి, విచారణ జరపాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ఈ దాడులకు సంబంధించి ఆదివారం వెలుగులోకి వచ్చిన పంచనామా నివేదికతో టిడిపి నేతలు ఎదురు దాడి ప్రారంభించారు.

దీని ప్రకారం శ్రీనివాస్‌ నివాసంలో దొరికింది కేవలం 2.63 లక్షల రూపాయలు మాత్రమే.దానిని కూడా ఆయనకు ఐటి శాఖ అధికారులు వెనక్కి ఇచ్చేశారు. వైసిపి నేతలు కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం కుండా శ్రీనివాస్ డైరీలలో చంద్రబాబు ఆదాయ, వ్యయాల వివరాలున్నాయని, వాటిపై ఐటి అధికారులు మరింత దరీఫతు జరుపవలసి ఉన్నట్లు స్వయంగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఆ వివరాలతో చంద్రబాబు, లోకేష్ జైళ్లకు వెళ్ళక తప్పదంటూ వైసిపి నేతలు శాపనార్ధాలు పెడుతున్నారు.

ఇట్లా ఉండగా, ఈ దాడులు ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి బినామీలను దృష్టిలో ఉంచుకొని జరిగాయని, పట్టుబడ్డవి కూడా వారికి చెందినవే అనే మరో కొత్త కధనాన్ని టిడిపి నేతలు తెరపైకి తెస్తున్నారు. అందుకనే జనం దృష్టి మళ్లించడం కోసం కేసీఆర్ `ఆదేశం’ పైననే వైసిపి నేతలు చంద్రబాబుపై ఆరోపణల యుద్ధం ప్రారంభించారని అంటూ ధ్వజమెత్తుతున్నారు.

ఇలా ఉండగా, పంచనామా ప్రకటన పట్ల వైసిపి వర్గాలు ఒకింత ఖంగు తిన్నట్లు తెలుస్తున్నది. రూ 2,000 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తించినట్టు. రూ 85 లక్షల నగదు. రూ 71 లక్షల విలువ చేసే బంగారం దొరికినట్టు సాక్షాత్తు ఐటిశాఖ కార్యదర్శి సురభి చేయడాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక్కడేదో గూడుపుఠాణి జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ దర్యాఫ్తులోకి దింపాలని అధికారపక్షంలోని కొందరు నేతలు భావిస్తున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా పంచనామా నివేదిక లీక్‌ కావడం, అది కూడా ప్రతిపక్షనేతకు నూరు శాతం క్లీన్‌చిట్‌ ఇచ్చినట్టుగా ఉండటంతో ఈ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా వ్యవహరించే ఒకరిద్దరు న్యాయనిపుణులతో పాటు, ఆర్థిక వ్యవహారాల విశ్లేష కులు కూడా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో దర్యాప్తు జరిపించాలని సూచించినట్లు తెలిసింది.