https://oktelugu.com/

Praveen – Faima: కరోనా వచ్చిన నాకు సేవలు చేశాడు.. ‘పటాస్ ప్రవీణ్’తో రిలేషన్ పై ఫైమా క్లారిటీ!

Praveen – Faima: పటాస్ కార్యక్రమం ద్వారా ప్రవీణ్, ఫైమా వంటి కమెడియన్స్ పరిచయమయ్యారు. ఈ కార్యక్రమం తర్వాత వీరందరూ వివిధ బుల్లితెర కార్యక్రమాల్లో తమదైన శైలిలో స్కిట్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఫైమా, ప్రవీణ్ మధ్య ప్రేమాయణం నడుస్తోంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి.ఈ క్రమంలోనే వీరికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా చాలామంది వీరిద్దరి రిలేషన్ గురించి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 30, 2021 / 12:34 PM IST
    Follow us on

    Praveen – Faima: పటాస్ కార్యక్రమం ద్వారా ప్రవీణ్, ఫైమా వంటి కమెడియన్స్ పరిచయమయ్యారు. ఈ కార్యక్రమం తర్వాత వీరందరూ వివిధ బుల్లితెర కార్యక్రమాల్లో తమదైన శైలిలో స్కిట్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఫైమా, ప్రవీణ్ మధ్య ప్రేమాయణం నడుస్తోంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి.ఈ క్రమంలోనే వీరికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా చాలామంది వీరిద్దరి రిలేషన్ గురించి ఎన్నో ప్రశ్నలు అడిగారు.

    Praveen – Faima

    ఈ క్రమంలోనే ఫైమా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రవీణ్ తో తనకు ఉన్న రిలేషన్ గురించి బయట పెట్టారు. ఈ సందర్భంగా ఫైమా మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుంచి తనని ప్రేమిస్తున్నాడని, అలా తనని ప్రేమించడం ఎంతో సంతోషంగా, ఆ ఫీలింగ్ ఎంతో అద్భుతంగా ఉందని ఫైమా చెప్పుకొచ్చింది. ప్రవీణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని అయితే ఇష్టం ప్రేమ కాదని కూడా తెలిపారు.

    Also Read:  ప్రీ రిలీజు అడ్డంకులను ‘ఆర్ఆర్ఆర్’ అధిగమించేనా?

    తనపై ఉన్న ఇష్టం ఎప్పుడైతే ప్రేమగా మారుతుందో అప్పుడు తప్పకుండా తన ప్రేమ విషయాన్ని బయటపెడతానని ఈమె తెలిపారు.ఇక కరోనా అంటే ఆమడ దూరం పరిగెత్తే ఈ రోజుల్లో నాకు కరోనా వచ్చినప్పుడు ప్రవీణ్ తనకు ఎన్నో సేవలు చేశాడని, బహుశా పెళ్లి చేసుకున్న వాడు కూడా అంత బాగా చూసుకోరేమో అంటూ ఫైమా, కరోనా సమయంలో ప్రవీణ్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఎమోషన్ అయ్యారు.

    Also Read: ఎప్పుడైనా ఇలియానా తల్లిని చూశారా.. ఎంత అందంగా ఉందో!