బీజేపీ సీనియర్ నేతల ముందస్తు వ్యూహం ఫలిస్తుందా?

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక త్వరలోనే జరుగనుంది. బీజేపీ అధిష్టానం పార్టీ అధ్యక్షుడి ఎన్నికపై ఫోకస్ పెట్టడంతో స్థానిక సీనియర్ నేతలు సరికొత్త స్ట్రాటజీని అవలంబిస్తున్నారు. అధ్యక్ష పదవీ రేసులో ఉన్నవాళ్లతోపాటు పదవులపై ఆశలు పెట్టుకున్న వాళ్లంతా ఒకేవిధంగా ఆలోచిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక చివరి అంకానికి చేరుకుంది. దీంతో పార్టీలోని సీనియర్లంతా ఏకమవుతున్నారు. బీజేపీ అధిష్టానం ఇటీవల అధ్యక్ష ఎంపిక కోసం చేపట్టింది. ఇందులో పార్టీ ఇన్ చార్జి […]

Written By: Neelambaram, Updated On : March 3, 2020 3:27 pm
Follow us on

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక త్వరలోనే జరుగనుంది. బీజేపీ అధిష్టానం పార్టీ అధ్యక్షుడి ఎన్నికపై ఫోకస్ పెట్టడంతో స్థానిక సీనియర్ నేతలు సరికొత్త స్ట్రాటజీని అవలంబిస్తున్నారు. అధ్యక్ష పదవీ రేసులో ఉన్నవాళ్లతోపాటు పదవులపై ఆశలు పెట్టుకున్న వాళ్లంతా ఒకేవిధంగా ఆలోచిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక చివరి అంకానికి చేరుకుంది. దీంతో పార్టీలోని సీనియర్లంతా ఏకమవుతున్నారు. బీజేపీ అధిష్టానం ఇటీవల అధ్యక్ష ఎంపిక కోసం చేపట్టింది. ఇందులో పార్టీ ఇన్ చార్జి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న లక్ష్మణ్‌నే కొనసాగించాలని మెజార్టీ నేతలు ప్రతిపాదన తెచ్చినట్లు సమాచారం. ఒకవేళ అధ్యక్షుడిని మార్చాల్సి వస్తే మాత్రం తమకు అవకాశం ఇవ్వాలని అధిష్టానంలోని పెద్దలను కోరుతున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో డీకే అరుణ, ఎంపీ అర్వింద్, అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు లాంటి నేతల పేర్లు విన్పిస్తున్నాయి. వీరిని అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తే, తమ పెత్తనం సాగదని పార్టీలోని సీనియర్ నేతలు అభద్రతాలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ నే తిరిగి ఎన్నుకోవాలని సీనియర్లు భావిస్తున్నారు. ఆయనకు అంగ బలం లేదు, అర్ధబలం అంతకన్నా లేదు. దీంతో భవిష్యత్తులో తమకు ప్రమాదం కాడనే ముందుజాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. లక్ష్మణ్ కు జిల్లాలో ఫాలోవర్స్ తక్కువగా ఉన్నారు. దీంతో తమకు ఢోకా ఉందని సీనియర్లు భావిస్తున్నారు.

ఒకప్పుడు ఈ నేతను అధక్ష్య పదవీ నుంచి తొలగించాలనుకున్న నేతలే ప్రస్తుతం ఆయనకే మద్దతు తెలుతుడం విశేషం. అధిష్టానం కూడా లక్ష్మణ్ విషయంలో సానుకూలంగా ఉంది. దీంతో ఆయనకే తిరిగి అధ్యక్ష పదవీ దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముందస్తు వ్యూహంలో భాగంగానే సీనియర్లంతా లక్ష్మణ్ కే రాష్ట్రంలో పట్టాభిషేకం చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ జిల్లాల్లో అధ్యక్షుల నియామకంపై దృష్టిపెట్టింది. జిల్లా అధ్యక్షుల ఎన్నికల అనంతరం రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఉండబోతుంది. ఈ దిశగా అధిష్టానం ముందస్తుగా అభిప్రాయ సేకరణ చేపట్టింది.

ఇందులో మెజార్టీ నేతలు లక్ష్మణ్ కే మద్దుతు పలుకుతున్నారు. లక్ష్మణ్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటే తమ ఆటలు సాగించవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ వీరంతా అనుకున్నట్లు లక్ష్మణ్ కే పట్టంకట్టిన తర్వాత ఆయన తనకంటూ ఫాలోవర్స్ పెంచుకుంటే మాత్రం సీనియర్ల ముందస్తు వ్యూహం బెడిసికొట్టడం ఖాయంగా కన్పిస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..