పెద్దలు సాధారణంగా ఒక సామెత చెప్పేవాళ్ళు “ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే..చుట్ట కాల్చుకోవడానికి ఇంకొకడు వచ్చాడట” ప్రస్తుతం తెలంగాణ ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్ పరిస్థితి అలానే ఉంది. ప్రపంచమంతా కరోనా భయంతో వణికి పోతుంటే.. ఆయనకు మరో కష్టం వచ్చిందట. ఎన్నో ఏళ్లుగా పౌల్ట్రీ పరిశ్రమ వ్యాపారంలో ఉన్న ఈటెలకు ఈ కరోనా దెబ్బతో రూ.8కోట్లు నష్టం వాటిల్లిందని వాపోతున్నారు.
చికెన్ తినడం వల్ల కరోనా రాదనే భయాన్ని ప్రజలలో నుంచి పోగొట్టేందుకు చికెన్ మేళాను కూడా నిర్వహించారట.. ఆ మేళా కి చీఫ్ గెస్ట్ గా మంత్రి కేటీఆర్ ని పిలిచారు. దీని వల్ల పరిస్థితిలో మార్పు వస్తుందని అంచనా వేశారు. కానీ “మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు” అంతలోనే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో… ప్రజల్లో కరోనా వైరస్ పట్ల ఉన్న భయాందోళనలు మరింత పెరిగిపోయాయి. చికెన్ తింటేనే కాదు కోడి గుడ్డు తిన్నా కరోనా వస్తుందనే వదంతులు వ్యాపించడంతో ఏమి చేయాలో అర్థంకాక మంత్రి మౌనంగా ఉన్నట్లు సమాచారం. ఏమి చేద్దాం “కాలం కలిసిరాక పోతే.. అరటిపండు తిన్నా..పన్ను ఇరిగిద్ది” మంత్రిగారు.