మీకు అర్థమౌతుందా… కవితమ్మ మందు పార్టీ!

నిజామాబాద్ మాజీ ఎంపీ, కేసీఆర్ గారాల పట్టి కవితమ్మ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు. తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ ఒక వైపు కరోనా కట్టడి గూర్చి సమీక్షలు నిర్వహిస్తూ.., ప్రజలకు పలు సూచనలు, సలహాలు ఇస్తుంటే తెలంగాణ ఆడబిడ్డ మరో పనిలో బిజీగా ఉన్నారు. ప్రభుత్వం ఆదేశాలకు భిన్నంగా కవిత వ్యహరించిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రపంచం మొత్తం కరోనా భయంతో అల్లాడుతుంటే.. సోషల్ డిస్టెన్స్ మెయింటేయిన్ చేస్తుంటే… కవితమ్మ భారీ […]

Written By: Neelambaram, Updated On : March 21, 2020 4:40 pm
Follow us on

నిజామాబాద్ మాజీ ఎంపీ, కేసీఆర్ గారాల పట్టి కవితమ్మ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు. తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ ఒక వైపు కరోనా కట్టడి గూర్చి సమీక్షలు నిర్వహిస్తూ.., ప్రజలకు పలు సూచనలు, సలహాలు ఇస్తుంటే తెలంగాణ ఆడబిడ్డ మరో పనిలో బిజీగా ఉన్నారు.

ప్రభుత్వం ఆదేశాలకు భిన్నంగా కవిత వ్యహరించిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రపంచం మొత్తం కరోనా భయంతో అల్లాడుతుంటే.. సోషల్ డిస్టెన్స్ మెయింటేయిన్ చేస్తుంటే… కవితమ్మ భారీ విందును ఏర్పాటు చేసి విమర్శల పాలయ్యారు.

స్థానిక సంస్థల ఉప ఎన్నిక నేపథ్యంలో కవిత కి ఎమ్మెల్సీ టికెట్ ని కేటాయించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఆమె పార్టీ నాయకులకు హైద్రాబాద్ శివారు ప్రాంతంలో విందు ఏర్పాటు చేసింది. ఆ విందుకు జడ్పిటిసి, ఎంపిటిసి, కార్పొరేటర్లును పెద్ద ఎత్తున ఆహ్వానించింది. వారు తాగుతూ, చిందులేస్తూ.. హల్ చల్ చేస్తున్న ఒక వీడియో లీక్ అయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రజలను పరిపాలించే తాగుబోతుల బ్యాచ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ…కవితను విమర్శిస్తున్నారు.