https://oktelugu.com/

JR NTR – Ram Charan: చరణ్ నాలో సగ భాగం.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్!

JR NTR – Ram Charan: రామ్ చరణ్,ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని జనవరి 7వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలలో ప్రమోషన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న చిత్రబృందం తాజాగా కేరళలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రామ్ చరణ్ ఎన్టీఆర్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 30, 2021 / 01:15 PM IST
    Follow us on

    JR NTR – Ram Charan: రామ్ చరణ్,ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని జనవరి 7వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలలో ప్రమోషన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న చిత్రబృందం తాజాగా కేరళలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రామ్ చరణ్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.

    JR NTR – Ram Charan

    ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ తనలో సగభాగం అని తెలిపారు. నా బ్రదర్ నా సగభాగం లేకపోతే ఈ సినిమా ఉండేది కాదని చరణ్ గురించి చెబుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. అనంతరం ఈ వేదికపై ఎన్టీఆర్ మాట్లాడుతూ చరణ్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ…

    Also Read: ఎప్పుడైనా ఇలియానా తల్లిని చూశారా.. ఎంత అందంగా ఉందో!

    నా బ్రదర్ చరణ్ నాలో సగ భాగం.. చరణ్ నాకు ఎడమవైపుతో సమానం ఎందుకంటే నా గుండె ఉండేది ఎడమవైపు అంటూ చరణ్ గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. మా ఇద్దరి మధ్య ఏర్పడిన ఈ స్నేహబంధం ఈ సినిమాతో మొదలైంది కాదు. మా స్నేహబంధం చూసి మాకు ఈ సినిమాలో నటించే అవకాశాన్ని కల్పించారు. నా బ్రదర్ తో కలిసి దాదాపు 200 రోజులు గడపడానికి అవకాశం ఇచ్చిన ఆ భగవంతుడికి ప్రత్యేక ధన్యవాదాలు. మా స్నేహ బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని తారక్ చరణ్ గురించి మాట్లాడుతుండగా ఒక్కసారిగా చరణ్ ఎన్టీఆర్ ను వెనకనుంచి హత్తుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

    Also Read: అఫీషియల్ : నాగచైతన్య, సమంత బాటలో మరో స్టార్ కపుల్..