Black money: నల్లధనాన్ని వెలికితీసేందుకు ఐటీ అధికారులు ఎప్పటికప్పుడు నిఘా పెడుతూనే ఉంటారు. ఈక్రమంలోనే దేశ వ్యాప్తంగా ఇటీవలీ కాలంలో పెద్దమొత్తంలో నల్లధనం బయటపడుతోంది. పెద్దనోట్ల రద్దు తర్వాత నల్లధనాన్ని ఐటీ శాఖ అధికారులు పలు రాష్ట్రాల్లో పెద్దమొత్తంలో స్వాధీనం చేసుకుంటుంది. అయితే ఐటీ శాఖ దాడి చేసిన ప్రతీసారి వందల కోట్ల రూపాయాలు పట్టుబడుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది.
నల్లధనం ప్రధానంగా బడా వ్యాపారులు, రాజకీయ, సెలబ్రెటీల ఇళ్లల్లోనే ఇటీవలీ కాలంలో ఎక్కువగా పట్టుబడుతోంది. సాధారణంగా ఐటీ వర్గాలు దాడులు చేస్తాయి కానీ ఎవరిపై దాడి చేశామనే విషయాలను మాత్రం మీడియాకు వెల్లడించవు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు చెందిన నల్ల ధనాన్ని పక్కా సమాచారంతో స్వాధీనం చేసుకున్నప్పటికీ ఐటీ అధికారులు వారి వివరాలను వెల్లడించిన దాఖలు ఎన్నడూ లేవు.
Also Read: ఏపీలో సీజ్ చేసిన సినిమా థియేటర్లు తెరుస్తున్న ప్రభుత్వం.. దీనివెనుక పీపుల్స్ స్టార్
గత ఏడాదిన్నర క్రితం హైదరాబాద్ లో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో వందల కోట్ల రూపాయాలను ఐటీ శాఖ పట్టుకోవడం అప్పట్లో సంచనలంగా మారింది. భారీ మొత్తంలో డబ్బును చూసి ఐటీ శాఖ అధికారులు షాకయ్యారు. అయితే ఈ డబ్బు ఎవరికి చెందిందినే విషయాలను మాత్రం ఐటీ శాఖ వెల్లడించలేదు. అయితే ఆ సంస్థల్లో భారీగా డబ్బులు ఎలా వచ్చాయనే విచారణ మాత్రం అధికారులు చేస్తున్నారు.
ఏపీకి చెందిన ఓ బడా రాజకీయ నేత సదరు రియల్ ఎస్టేట్ కంపెనీకి ప్రభుత్వం తరుఫున ప్రయోజనం కల్పించారనే ప్రచారం జరుగుతోంది. ఈమేరకు సదరు సంస్థ నుంచి వసూలు చేసిన కమిషన్ ను రియల్ ఎస్టేట్ కంపెనీలోకి పెట్టుబడిగా పంపారని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ప్రభుత్వం తరుఫున ప్రయోజనం పొందరు సదరు సంస్థ ఐటీ శాఖ ఉచ్చులో ఇరుక్కుపోయింది.
ఈ కంపెనీపై సైతం ఐటీ అధికారులు దృష్టిసారించే అవకాశం కన్పిస్తోంది. మరోవైపు ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సదరు రాజకీయ నేత బయటకు వచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. గతంలో రాజకీయ నేతలకు సంబంధించిన బ్లాక్ మనీ వివరాలను ఐటీ శాఖ వెల్లడించిన దాఖలు లేవు. అయితే ఇప్పుడు మాత్రం ఆ రాజకీయ నేత పేరు బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ విన్పిస్తోంది. దీంతో ఆ రాజకీయ నేత ఎవరై ఉంటారనే అనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది.
Also Read: నిధులు, అభివృద్ధి.. వైసీపీలో ముసలం.. జగన్ ను ముంచేస్తుందా?