లాజిక్ లేని లాక్ డౌన్.. జూన్ లో ఊహించని ఫిగర్!

భారత్ లో లాక్ డౌన్ పొడిగింపు, సడలింపులు వ్యవహారం చిత్ర, విచిత్రంగా ఉంది. ఒకప్పుడు కరోనా తక్కువగా ఉన్న సమయంలో… లాక్‌ డౌన్ నిబంధనలు ఎంతో పక్కాగా అమలయ్యాయి. తీరా కరోనా కేసులు బాగా పెరిగాక… నిబంధనలు సడలించారు. ఫలితంగా రోజూ కొత్త కేసులు రాకెట్ వేగంతో నమోదవుతున్నాయి. గంటగంటకూ పాజిటివ్ కేసులు, మరణాలూ పెరిగిపోతున్నాయి. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సిసిఎంబి) అంచనా ప్రకారం జూన్‌ చివరినాటికి ఇండియాలో కరోనా అత్యంత తీవ్ర […]

Written By: Neelambaram, Updated On : May 26, 2020 1:03 pm
Follow us on

భారత్ లో లాక్ డౌన్ పొడిగింపు, సడలింపులు వ్యవహారం చిత్ర, విచిత్రంగా ఉంది. ఒకప్పుడు కరోనా తక్కువగా ఉన్న సమయంలో… లాక్‌ డౌన్ నిబంధనలు ఎంతో పక్కాగా అమలయ్యాయి. తీరా కరోనా కేసులు బాగా పెరిగాక… నిబంధనలు సడలించారు. ఫలితంగా రోజూ కొత్త కేసులు రాకెట్ వేగంతో నమోదవుతున్నాయి. గంటగంటకూ పాజిటివ్ కేసులు, మరణాలూ పెరిగిపోతున్నాయి. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సిసిఎంబి) అంచనా ప్రకారం జూన్‌ చివరినాటికి ఇండియాలో కరోనా అత్యంత తీవ్ర స్థాయికి చేరుతుంది. ప్రస్తుతం లక్షా 38వేల కేసులు ఉండగా… జూన్ చివరి నాటికి కేసుల సంఖ్య 20 లక్షలకు చేరుతుందని చెబుతోంది.

నిబంధనలు సడలించడమే కేసులు పెరుగుతుండటానికి కారణం అని సిసిఎంబి భావిస్తోంది. ప్రధానంగా శ్రామిక్ రైళ్లను వెయ్యడం, వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లడం, రవాణా సడలింపులు వంటివి కరోనా విజృంభించేందుకు కారణం అవుతున్నట్లు చెబుతోంది. ఇన్నాళ్లూ పల్లెల్లో పెద్దగా లేని కరోనా వైరస్… ఇప్పుడు అక్కడ కూడా బాగా విస్తరిస్తోందని సిసిఎంబి డైరెక్టర్ రాకేశ్ శర్మ తెలిపారు. దేశంలో నిజానికి కరోనా చాలా ఎక్కువగానే ఉందనీ… టెస్టులు ఎక్కువగా చెయ్యకపోవడం వల్ల అది బయటకు తెలియట్లేదని అంటున్నారు రాకేశ్ శర్మ. ప్రస్తుతం 10 లక్షల మందిలో 1744 మందికి మాత్రమే టెస్టులు చేస్తున్నారనీ… ఇంత తక్కువగా టెస్టులు మరే దేశంలోనూ జరగటలేదని… వైరాలజీ ఎక్స్‌పర్ట్ జమీల్ తెలిపారు. ప్రస్తుతం ఇండియాలో కరోనా వైరస్ మూడో స్టేజీలో ఉందని ఆయన అంటున్నారు.

వారం నుంచి ఇండియాలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. శుక్ర, శని, ఆదివారం… ఈ మూడ్రోజులూ రోజూ 6వేలకు పైగా కేసులొచ్చాయి. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం అంటున్నారు నిపుణులు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలూ… ఈ విషయాన్ని సీరియస్‌ గా తీసుకోవాలని కోరుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల్లో కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోదనీ… కనీసం 3 నుంచి 4 ఏళ్లపాటూ వైరస్ బతికి ఉండే ఛాన్స్ ఉంటుందని సిసిఎంబి నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో 2022 వరకూ కరోనా ప్రభావం కనిపిస్తూనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేంద్ర, రాష్ట్రాలు ఈ దిశగా సుదీర్ఘ ప్రణాళికతో ముందుకెళ్లాలంటున్నారు.