ఓ తల్లి విషాదగాధ.. కూతురు చనిపోయిన 2రోజులకే డ్యూటీ!

మనసుకి నచ్చిన వారు దూరమైనప్పుడు ఆ బాధను తట్టుకోవడం కష్టం, ఆ పరిస్థితి నుండి కోలుకోని మరళా సాధారణ స్థితికి రావడం మరింత కష్టం. వారి జ్ఞాపకాలు మనిషిని అతలాకుతలం చేస్తాయి. కానీ, ఒడిశాలోని ఒక లేడీ హోమ్ గార్డ్ తన కుమార్తెను కోల్పోయిన రెండు రోజులకే తిరిగి విధుల్లోకి చేరి అందర్నీ అబ్బుర పరిచింది. ఆమెకున్న బాధ్యతలు ఆమెను విధుల్లోకి రప్పించాయని తెలిసినప్పుడు అనేకమంది కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ […]

Written By: Neelambaram, Updated On : May 9, 2020 1:43 pm
Follow us on

మనసుకి నచ్చిన వారు దూరమైనప్పుడు ఆ బాధను తట్టుకోవడం కష్టం, ఆ పరిస్థితి నుండి కోలుకోని మరళా సాధారణ స్థితికి రావడం మరింత కష్టం. వారి జ్ఞాపకాలు మనిషిని అతలాకుతలం చేస్తాయి. కానీ, ఒడిశాలోని ఒక లేడీ హోమ్ గార్డ్ తన కుమార్తెను కోల్పోయిన రెండు రోజులకే తిరిగి విధుల్లోకి చేరి అందర్నీ అబ్బుర పరిచింది. ఆమెకున్న బాధ్యతలు ఆమెను విధుల్లోకి రప్పించాయని తెలిసినప్పుడు అనేకమంది కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని పూరిలో పిపిలి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న గౌరీ బెహారా అనే హోమ్ గార్డ్ కి 13 ఏళ్ల కుమార్తె ఉంది. ఆ కుమార్తె గత కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్‌ తో బాధపడుతుంది. గత నెల 24వ తేదీన ఆ పాప చనిపోయింది. కుమార్తె చనిపోయి నిండా రెండు రోజులు కూడా గడవకముందే గౌరీ బెహారా విధుల్లోకి వచ్చింది.

అది ఏప్రిల్ 24 , రాత్రి 8 గంటలు, లాక్ డౌన్ కారణంగా గౌరీ ఓవర్ టైం డ్యూటీ చేస్తుంది. ఇంతలో ఆమెకు ఇంటి దగ్గర నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. “నీ కూతురి పరిస్థితి సీరియస్ గా ఉంది, ఆమె తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంది నువ్వు వెంటనే రావాలి” అని అవతలి వ్యక్తి చెప్పారు. ఈ వార్త ఆమె చెవులకు చేరడంతో, వెంటనే తన సైకిల్ తో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి హుటా హుటీగా చేరుకుంది. ఆమె ఇంటికి చేరుకునే సమయానికి, ఆమె కూతురు చనిపోయి ఉంది. తన బిడ్డ ఎటువంటి కదలిక లేకుండా పడుకోవడాన్ని చూసిన ఆ తల్లి గుండెలవిసేలా ఏడ్చింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అలా రెండు రోజులు గౌరీ బెహారా బాధపడ్డది. తన మీద ఆధారపడ్డ వృద్ధ తల్లిదండ్రులు, మానసిక వికలాంగడైన సోదరుడు కోసం ఉబికివస్తున్న కన్నీళ్ళను దిమింగుకొని, పుట్టెడు దుఃఖాన్ని అపుకొని మరళా విధుల్లోకి చేరింది.

కొన్ని సంవత్సరాల క్రితం కట్టుకున్న వాడు ఆమెను కాదనుకున్నాడు. క్యాన్సర్ తో బాధపడుతున్న కూతురి బాధ్యత ఒకవైపు, వృధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, మానసిక వికలాంగుడైన సోదరుడి బాధ్యత మరోవైపు తన భుజాల మీద వేసుకొని జీవనం సాగుతున్న గౌరీ బెహారా కి కూతురి మరణం అత్యంత చేదు వార్త. కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ఆమెకి సహాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.