
పవన్ కళ్యాణ్ ని ఎవరన్నా ఏమాత్రం సున్నితంగా విమర్శించినా వెంటనే ఎక్కువగా రియాక్ట్ అవుతాడు. ఆయన వెంటనే, నేను వేల కోట్లు వదులుకొని వచ్చాను, నాకు ప్రధాన మంత్రి దగ్గర నుంచి అందరు తెలుసు అని మొదలు పెడతాడు. అయ్యా విషయం అది కాదు. మీరు రాజకీయాలలోకి వచ్చిన తర్వాత కొంత స్పష్టత అవసరం. మీ నిజాయతీని ఎవరూ శంకించటం లేదు స్వామి. మీరు ఫుల్ టైం రాజకీయలలో ఉండాలంటే, మిమ్మల్ని నమ్ముకుని లక్షలమంది రోడ్డు మీదకు వచ్చినతర్వాత, నిజాయతీ ఒక్కటే సరిపోదు- నిబద్ధత కూడా కావాలి.
సంస్థాగతంగా పార్టీని పటిష్ట పరిచే పనులు ఎక్కడా ఎవ్వరికి తెలియదు. మీరు సీక్రెట్ గా చేస్తే అది వేరే విషయం అనుకోండి. ఇంతవరకు విధాన పరమైన ఒక ప్రకటన ఒక వ్యాసం రూపంలో గాని ఒక పుస్తక రూపంలో గాని ఎక్కడా చూడలేదు . ఇది కూడా మీరు సీక్రెట్ గా చేస్తే అది వేరే విషయం అనుకోండి. ప్రజలకు మీమీద మంచి అభిప్రాయం ఉంది కానీ అది సరిపోదు సారూ. మీరు ప్రజలకి ఒక విశ్వాసం కల్పించాలి, మంచితనం ఒక్కటే సరిపోదు. ఎన్నికలకు ముందు 6 నెల్ల క్రితం ప్రజల్లోకి వచ్చినప్పుడు, వాళ్ళు మీకు బ్రహ్మ రధం పట్టారు. కానీ మీరు 6 నెలల్లో ఎన్నోపిల్లిమొగ్గలు. ఒక రెండు వారాలు ప్రజల్లో ఉంటారు, ప్రజలందరూ మీగురుంచి మంచిగా ఆలోచించటం మొదలు పెట్టగానే మీరు ఒక నెల అంతర్ధానమైపోతారు. సరేలే అని సర్దిపెట్టుకొని ముందుకెళదాం అనుకొంటే అదేతంతు రిపీట్ అవుతూ వచ్చింది.
మీరు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా, జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ప్రజలంతా మనకి ఒక ఆల్టర్నేట్ వచ్చాడు అనుకొన్నారు. మీ మనసులో ఏముందో తెలియదు కానీ, ఎన్నికల చివరి క్షణంలో మీరు జగన్మోహన్ రెడ్డి ని తిడుతూ, టీడీపీ ని ఏమనకుండా ఉంటే ప్రజలు అంత తెలివి లేని వాళ్ళు కాదు. మిమ్మల్ని, మీ అన్నయ్యను నమ్ముకొని ఎంతోమంది అభాసుపాలయ్యారు. అది మీ జన్మ హక్కుఅనుకోవద్దు.
ప్రజలకి ఒక స్పష్టత ఇవ్వండి ఇప్పటికైనా. రెండు చోట్ల పోటీచేసి దారుణంగా ఓడిపోతే ఇంతవరకు మీరు ఆత్మావలోకనం చేసుకున్నట్లే మాకు కనిపించడంలేదు.