
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలుత అమరావతి సమస్యపై ఉధృతంగా వ్యవహరించినా…. ఇప్పుడు కొంచం ఊపు తగ్గించాడనే చెప్పవచ్చు. తాను మొదట స్పందించినంత స్థాయిలో ఇప్పుడైతే కచ్చితంగా స్పందించట్లేదు. దీనికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఉంది.
పవన్ సినిమాలు వదిలి…రాజకీయాల బాట పట్టాడు. అప్పటినుంచి ప్రజలు ఆశించిన స్థాయిలోనే వ్యవహరించినా… ఇప్పుడు సినిమాల్లో తిరిగి అరంగేట్రం చేసాక రాజకీయాలు పక్కన పెట్టి సినిమాల మీదే ఎక్కువ దృష్టి సారించారు.
Latest News: పవన్ కళ్యాణ్, ఆ రెండు మతాలకు వ్యతిరేకమా..?
ప్రస్తుతం ఒక హిందీ సినిమాని తెలుగులోకి రీమేక్ చేస్తూ… షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా తదనంతరం యధావిధిగా రాజకీయాలలో చక్రం తిప్పుతాడు అనుకుంటే.. ఇంతలోనే దర్శకుడు క్రిష్ తో ఇంకో సినిమా చేయటానికి జై కొట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. కనుక ఈ సినిమాల తర్వాత అయిన రాయకీయాలలో క్రియ శీలంగా వ్యవహరిస్తారా..లేదా.. అనే సందేహం పార్టీ కార్యకర్తలలో నెలకుంది.
Read More: పవన్ కి అండ బీజేపీ – బీజేపీకి దండ పవన్
వాళ్ల సందేహంలో కొంత నిజం ఉంది… అసలు సినిమాలే చేయను అన్న పవన్ మళ్ళీ సినిమాలలో బిజీ అవ్వటం కొంత మందికి ఆనందం కలిగించినా కానీ.. మరి కొంతమందికి విచారం కలిగించింది. పవన్ తన సినిమాలు అయ్యే దాక రాజకీయాలలో మునుపులా వ్యవహరించలేరు.. అవి పూర్తి అయితే తప్ప పవన్ తన ఆలోచన మొత్తం జనల మీద పెట్టలేడు.
బీజేపీతో పొత్తు తర్వాత రాష్ట్రంలో సమస్యలు తేలికగ తీసుకున్నాడు అనే వాదన కూడా లేకపోలేదు. ఏది ఏమైన ఇంతకు ముందున్న ఊపు-ఉత్సాహం ఇప్పుడైతే తగ్గిపోయిందన్న మాట మాత్రం వాస్తావం. పవన్ ప్రజా క్షేత్రంలో తనదయిన ముద్ర వేయాలంటే ఖచ్చితంగా వేరే ఆలోచనలు తీసివేయాలి.. అప్పుడే ఒక నాయకుడిగా ఎదగ గలుగుతాడు.
ఇది కూడా చదవండి: అమిత్ షా ఆఫర్.. పట్టుకున్న పవన్