
సాధారణంగా ఒక రాష్ట్ర శాసనమండలి రద్దు కావాలంటే మొదటిగా ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపాలి.. ఆ తర్వాత ఈ విషయంపై అసెంబ్లీలో చర్చ జరగాలి. అసెంబ్లీ లో 2/3 మెజారిటీ సభ్యులు ఆమోదం తెలపాలి. అనంతరం బిల్లు తయారు చేసి ఆ బిల్లును కేంద్రమంత్రి మండలికి పంపాలి.
బైక్ నడుపుతూ స్నానం చేసిన యువకులు… వీడియో వైరల్
కేంద్ర మంత్రి మండలి కూడా తప్పనిసరిగా ఆ బిల్లును ఆమోదించాలి. ఆ తర్వాత బిల్లు పార్లమెంట్ కి వెళ్తుంది. అక్కడ బిల్లు పాస్ అవ్వాలి. అక్కడనుండి నేరుగా రాష్ట్రపతి టేబుల్ పైకి వెళ్తుంది. రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేస్తే.. ఇక మండలికి మంగళం పలికినట్టే అని అర్థం.
Read More: పవన్ కళ్యాణ్ పారితోషికం తగ్గించుకున్నాడు.. ఎందుకో తెలుసా..!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మండలి రద్దు పరిస్థితి..
ఈ రోజు జగన్ అధ్యక్షతన జరిగిన కెబినెట్ సమావేశంలో మండలి రద్దుకు ఆమోదం లభించింది. రెండవ స్టెప్ గా అసెంబ్లీ లో చర్చ మొదలయింది. అసెంబ్లీలో 2/3 మెజారిటీ తప్పకుండా వస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ లో 80% మంది వైసీపీ నేతలే కాబట్టి. ఆ తర్వాత బిల్లును కేంద్ర కేబినెట్ నిర్ణయానికి పంపుతారు. కేంద్రం ఒప్పుకుంటే త్వరగానే రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి.