
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ తమ వాహన తయారీ ప్లాంటును ఆంధ్ర నుంచి తమిళనాడుకు తరలిస్తోంది అనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. రాయిటర్స్ అనే ప్రముఖ పత్రిక కియా మోటార్స్ తమిళనాడుకి తరలిపోతోంది అని ప్రచురించింది. తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ ఉన్నతాధికారి తమకు ఈ విషయం చెప్పినట్టుగా..తమ పత్రికలో వెల్లడించింది. దీనికి గాను ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయి మధ్యవర్తం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. హ్యుండాయి కంపెనీకి కియా కంపెనీకి ఉన్న దగ్గర సంబంధాలు ఉపయోగించుకొని కియాని తరలించాలనే ప్రయత్నం జరుగుతుందట. అయితే 1.1 బిలియన్ డాల్లర్లు ఖర్చు చేసి ఆంధ్రలో తమ సంస్థని స్థాపించి…ఇప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోటానికి గల కారణం ఏమి అయ్యుంటుంది అనే దాని పైన ఇప్పుడు దేశం మొత్తం చర్చించుకుంటుంది.
కియా 2017 లో చంద్రబాబు సహాయంతో అనంతపూరులో నిర్మించారు. ఇది డిసెంబరు నాటికి పూర్తయింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఉన్నంతకాలం ఏ ఇబ్బంది లేకుండా ఉన్న కియాకు.. జగన్ ప్రభుత్వం వచ్చాక పెద్ద సమస్యే వచ్చింది. చంద్రబాబుపై ఉన్న ద్వేషంతో జగన్ రాష్ట్రంలోని అన్నిటిమీద సమీక్షలు నిర్వహిస్తున్నాడు..ఇందులో భాగంగా జగన్ కన్ను కియా పైన కూడా పడింది.
హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ కియా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగిన సంగతి, కియా తమ ముఖ్య కార్యాలయానికి చెరవేసింది. జగన్ తెచ్చిన కొత్త నిబంధనలు ఆంధ్రలో ఉన్న ప్రైవేటు కంపెనీలకు నిద్రలేకుండా చేసింది. రాష్ట్రంలో ఉన్న ఏ సంస్థ అయినా 75 శాతం ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళకే ఇవ్వాలన్న నిబంధన కంపెనీలకు పెద్ద ఎదురు దెబ్బే. దీని కారణంగానే చాలా కంపెనీలు ఆంధ్ర నుంచి వెళ్ళిపోతున్నాయనే వాదన కూడా బలంగా ఉంది.
వీటికి తోడు చంద్రబాబు సమయంలో కియా కి ఇచ్చిన రాయతీలపై జగన్ సమీక్ష చేస్తున్నాడు. ఇలా కియా కి జగన్ ప్రభుత్వం వచ్చాక అన్ని ఎదురు దెబ్బలే తగిలాయి తప్ప..చెప్పుకోతగ్గ మంచి విషయం ఏది లేకపోగా…చంద్రబాబు ప్రారంభించిన కియాను జగన్ మళ్ళి ప్రారంభించినట్టు హడావుడి చేసారు.
కియా లాంటి దిగ్గజ సంస్థ 29 రాష్ట్రాలు ఉన్న దేశంలో…ఆంధ్రని ఎంచుకోవటం చాల గొప్ప విషయం. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఇలాంటి సంస్థల వలన చాలా మేలు జరుగుతుంది. అలాంటిది సంస్థ ప్రారంభం అయినా కొన్ని సంవత్సరాలలోనే తరలిపోవాలని చూస్తుందంటే ఇది కచ్చితంగా ప్రభుత్వం చేతగాని తనమే. రాయతీలు ఇవ్వాల్సిన కంపెనీలకు రాజకీయాలు రుచి చూపిస్తుంటే…బెదరక ఏమి చేస్తారు. ఈ విషయాన్ని జగన్ ప్రభుత్వం అవాస్తవం అని కొట్టి పడేసినా…ముందు ముందు ఇది చాల తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. జగన్ తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు రాష్ట్రాన్ని మరింత సంక్షోభంలోకి తీసుకెళ్తున్నాయి అనడానికి ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు.