
ఇసుక కొరత వలన ఇబ్బందులు పడుతున్న కార్మికులకు అండగా విశాఖలో జరిగిన జనసేన ‘లాంగ్ మార్చ్’ విజయంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సహం కనిపిస్తుంది. ఇసుక ఇబ్బందులపై ప్రభుత్వంతో పోరాడటానికి పవన్ కళ్యాణ్ వెంట వచ్చిన ఇసుకేస్తే రాలనంత జనంని చూసి జనసేనని విమర్శించే వాళ్ళు కూడా కొంత ఆలోచనలో పడ్డారు.
పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత మాటలు మినహాయిస్తే లాంగ్ మార్చ్ ‘చలో విశాఖపట్నం’ బాగా జరిగిందని చెప్పాలి. ఇదే రీతిలో గనుక జనసేనాని పవన్ కళ్యాణ్ తన ఆవేశాన్ని తగ్గించుకొని ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ… అప్పుడప్పుడు కాకుండా ఎక్కువశాతం ప్రజలను కలుస్తూ ఉంటే గనుక తనకి సినిమా పరమైన స్టార్ హోదా (అభిమానం) తో పాటు ప్రజా నాయకుడిగా మరింత ప్రజలకు దగ్గరవచ్చు అనడంలో సందేహములేదు.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే పిచ్చెక్కిపోయే అభిమానులు తనకి ఎంతో మంది ఉన్నారు. కానీ అది కేవలం ఒక సినిమా స్టార్ గానే , ఒక రాజకీయ నాయకుడిగా ఇంకా తనకి ప్రజల మనస్సులో చోటు సంపాదించుకోవాలిసిన అవసరం ఎంతో ఉంది. ఇప్పటికే చాలా మంది ప్రజల్లో “ఆ…. పవన్ కళ్యాణ్ ఎప్పుడో వస్తాడు …. నాలుగు మాటలు మాట్లాడుతాడు…. వెళ్ళిపోతాడు. అంతేగా….. !! ” అనే భావన ఉంది.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి ఇప్పటికే అత్యధికమగా 18-30 సంవత్సరాల వయసు గలవారి మద్దతు ఎక్కువగా ఉంది. 30-40 సంవత్సరాల వయసు ఉన్నవారు మద్దతు కొంతవరకు ఉంది. ఇకపోతే 50 ఆపైన వయసున్నవారి మద్దతు ఎక్కడో పట్టణాలలో ఉన్నవారు లేదా చదువుకున్నవారిలో కొంత ఉండొచ్చు. కానీ ఈ వయసు కలిగిన పల్లెటూరుల్లో నివసిస్తున్న వారి శాతం చాలా ఎక్కువ వారి ఓట్లు ఎంతో విలువైనవి ప్లస్ వారు ప్రతి ఎన్నికల్లో మిస్ అవ్వకుండా ఓట్లు వేస్తారు. కనుకనే వారి మనసులను కూడా గెలుచుకుంటేనే అనుకున్నది సాధించవచ్చు. దానికి ఒక రాజకీయ నాయకుడిగా తన హోదా ప్రకారం మాట్లాడితే చాలు . వారితో మమేకమై ఉంటే మరీ మంచిది!.
ఇక చంద్రబాబు విషయానికి వస్తే … ఒక్కొక్కరుగా పార్టీ నుంచి జారుకోవడం కొంత వరకు టిడిపి కి ఇబ్బందికరంగానే ఉంది . దానికి తోడు చంద్రబాబు వయసు మళ్లడం, వారసుడేమో తండ్రి కి తగ్గ కొడుకుగా లోకేష్ కి రాజకీయ చాతుర్యం లేకపోవడం, పైగా పప్పు అనే ముద్ర పడడంతో… టిడిపి నాయకులకు సరైన భవిష్యత్తు కనిపించక పార్టీ విడిచి వెళ్ళిపోతున్న సంగతి మనకు తెలిసిందే. అంతే గాక ప్రజల్లో కూడా చంద్రబాబు అంటే ఆయనకి ఎటు తోస్తే అటు మాట్లాడతాడు. అందితే జుట్టు అందకుంటే కాళ్లు పట్టుకునే రకం అనే భావన స్వతహాగా చంద్రబాబు తనంతట తానే గత ఎన్నికల సమయంలో మరియు ఎన్నికల తర్వాత తన తీరుని బట్టి ప్రజలకు దూరమైనట్టే!
ఇకపోతే ఇదే ఉత్సహంతో గనుక జనసేనాని ముందుకెళుతూ అనవసరమైన టిడిపి నాయకుల పొత్తులు లేకుండా గనుక వుంటే కచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడిని వెనక్కి నెట్టడం ఖాయం… ఇంకా నాలుగు సంవత్సరాలకు పైగానే సమయం ఉంది గనుక సరైన ప్రణాళికతో ముందుకెళితే అనుకున్నది సాధించవచ్చు.