
పార్టీ ఆవిర్భం నుంచి ఎన్నో సవాళ్లు ఎదురుకొని… 2019 ఎన్నికల్లో అధికారం చేజిక్కిచుకున్న జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ తగ్గకుండా తాను ఎన్నికల ముందు ప్రకటించిన విధంగానే నవ రత్నాలను ఆమలు చేస్తూ వెళ్తున్నాడు. నాడు నేడు అనే పథకంతో పాఠశాలలు మరియు ప్రభుత్వ ఆసుపత్రుల మరమ్మత్తు ఒక గొప్ప ఆలోచన.
తన ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా ఒక్కో కార్యక్రమము ఆలస్యం లేకుండా ప్రవేశ పెడుతున్నాడు. ఒక పక్క చెప్పినవి చేస్తూనే ఇంకో పక్క చెప్పని కొత్త కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తూ ప్రత్యర్థి పార్టీలకు చమటలు పట్టిస్తున్నాడు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఎండగడుతూ…టీడీపీ నాయకుల బెండు తీస్తున్నాడు. ఎవరికీ వారు మేము ఉత్తములమీ అని చెప్పుకుంటూ జనాలలో చలామణి అవుతుంటే….వాళ్ళ బాగోతాలు మొత్తం సమీక్షల పేరుతో జనల ముందు ఉంచుతున్నాడు.
Read More:
అమరావతిలో పవన్ కళ్యాణ్ కు 62 ఎకరాలు?
ఆటో డ్రైవర్లకి, చేనేత కార్మికులకి, బడి పిల్లలకి, మత్సకారులకి ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం కింద ఆర్ధిక సహాయం చేస్తూ వెళ్తున్నాడు. అసలే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. దీనికి తోడు వరుస పథకాలు అమలు చేస్తుంటే….డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయా అని విశ్లేశకులు సైతం తల గోక్కుంటున్నారు.
గోరంత చేసి కొండంత చెప్పుకునే టీడీపీ నాయకులు…అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే జగన్ చక చక పనులు చేస్తుంటే చూసి తట్టుకోలేక పోతున్నారు.
Read More:
జగన్, వ్యక్తిగతంగా హాజరు కావసిందే.. :ఈడీ కోర్టు
గతంలో ఇసుక సమస్య తార స్థాయికి చేరినా… కొన్ని రోజులకి దాన్ని పరిష్కరించాడు. ఇప్పుడు కూడా రాజధానుల విషయంలో కొంత వ్యతిరేకత ఉన్న కొన్ని రోజుల్లో అది సర్దుకు పోతుందనే నమ్మకంతో ఉన్నాడు జగన్. ఈ ఒక్క విషయం మినహాయించి దాదాపు అన్ని విషయాలలో జనాల్లో మంచి మార్కులే కొట్టేసాడు. ఒక్క అవకాశం ఇవ్వండి చేసి చూపిస్తా అన్న మాటకి…ప్రస్తుతం చిన్నల నుంచి పెద్దల దాక అందరితో శభాష్ అనిపించుకున్నాడు.
Read More:తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఎన్టీఆర్ బాటలో జగన్