
2020 పుర ఎన్నికల్లో తెరాస జాతీయ స్థాయి రికార్డ్ తో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. అలాగే గతంలో హుజూర్ నగర్‌లో బంపర్ విక్టరీ. ఈ విధంగా ఎన్నికల రణక్షేత్రంలో ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న తారక రాముడికి పట్టాభిషేకమే తరువాయా? వేదిక ఏదైనా, బాధ్యత ఏదైనా తిరుగులేకుండా, ఎదురేలేకుండా సత్తా చాటుతున్న యువ నాయకుడికి గురుబాధ్యతలకు వేళయ్యిందా? కేసీఆర్ తర్వాత కేటీఆరేనంటూ కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న డిమాండ్‌కు, ఆచరణరూపం ఇచ్చే టైమైందా? మున్సిపల్ విజయాన్ని తనకు మరోసారి కానుకగా ఇచ్చిన తనయుడు తారక రాముడికి, తండ్రి బహుమానం సిద్దం చేశారా? పుర ఎన్నికల జోష్ తర్వాత, అసలేం జరగబోతోంది?
Read More:
సారూ.. అప్పుడు గెలిచారు.. హామీలు మరిచారు..ఇప్పుడైనా జర దెఖో..
2018, డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. అలాగే ఐటీ శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు. టీఆర్ఎస్‌లో కేసీఆర్ తర్వాత కేటీఆరే కీలక నాయకుడన్నది, తెలంగాణ భవన్‌లో అత్యధికుల మాట. కేసీఆర్ తర్వాత సీఎం ఎవరన్న ప్రశ్న వచ్చిన ప్రతిసారీ మరో మాట తడుముకోకుండా, కేటీఆర్ పేరే మారుమోగుతోంది. 2020 కేటీఆర్‌కు అత్యంత కీలకమైన సంవత్సరంగా, పార్టీలో పెను మార్పుల సంవత్సరంగా పార్టీలో చర్చ జరిగింది. ఈ కొత్తేడాదిలో మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను విజయవంతంగా నిర్వహించి, కేసీఆర్‌కు కానుక ఇచ్చారు కేటీఆర్. ఇఫ్పుడు కేటీఆర్‌కు సైతం కేసీఆర్ బహుమానం సిద్దం చేశారన్న చర్చ ఊపందుకుంది. మరి తనయుడికి తండ్రి ఇచ్చే బహుమానం కోసం కొన్ని రోజులు వేచిచూడాలి..
Latest News: చైనా ల్యాబ్ లో తయారైన వైరస్.. దేనికోసం చేశారు.. బయటపడుతున్న నిజాలు..