
కరోనా వైరస్ అనే కొత్త వ్యాధి ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇది చైనాలో మొదలయ్యి….చుట్టు పక్కల ఉన్న అన్నిదేశాలకు వ్యాప్తిచెందుతుంది. అయితే ఈ కరోనా వైరస్ గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ముందే చెప్పారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Read More: కరోనా వైరస్ కలకలం: దాని లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలోని 114 వ శ్లోకంలో….కోరంకి అనే వ్యాధి గురించి ప్రస్తావించారు. ఈ వ్యాధి తూర్పన మొదలయ్యి ప్రపంచం మొత్తం వ్యపిస్తుందని…సుమారు కోటి మంది దాక ప్రాణాలు కోల్పోతారని… అయన తన పుస్తకంలో పొందుపరిచారు.
Latest News: చైనా ల్యాబ్ లో తయారైన వైరస్.. దేనికోసం చేశారు.. బయటపడుతున్న నిజాలు..
ఏమి జరిగిన మన వాళ్ళు కాలజ్ఞానంతో ముడి పెట్టి…తరువాత ఏమి జరుగబోతుందో ఊహిస్తారు. సరిగ్గా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కరోనా వైరస్ కూడా తూర్పున మొదలయ్యి…ఇతర దేశాలకు వ్యాపిస్తుంది… అచ్చాం కాలజ్ఞానంలో చెప్పిన విధంగానే. ఇప్పుడు జనాలు దానికి దీనికి ముడి పెట్టి..ఇది బ్రహ్మంగారు ముందే చెప్పారని ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందొ…ఎంత అబద్దం ఉందొ రాసిన బ్రహ్మంగారికే తెలియాలి. అయినా ఇప్పుడు వచ్చిన ఈ వైరస్ గురించి అప్పుడెప్పుడో బ్రహ్మంగారు చెప్పారంటే కొంచం నమ్మేలా లేకపోయినా…ఇదే నిజం అని నమ్మేవాళ్ళు కొన్ని వేలమంది ఉన్నారు.