
ఎమ్యెల్సీ ల్లో గుబులు పట్టుకుంది. ఇద్దరి మోతుబరీల రాజకీయ క్రీడలో మేము బలైపోయామా అనే మీమాంస ఎమ్యెల్సీ ల్లో మొదలయ్యింది. చంద్రబాబు నాయుడు తమని రాజకీయచదరంగం లో పావులాగా వాడుకున్నాడా అని అక్కడక్కడా మాట్లాడుకుంటున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. జగన్ కి కూడా కావాల్సిందిదే. అందుకే సోమవారం దాకా విరామమిచ్చాడు. ఈ రెండురోజుల్లో ఎమ్మెల్సీ లు ఏమైనా మారతారా అనే దింపుడుకళ్లెం ఆశ వున్నట్లుంది .
ఇంతకీ ఆరోజు ఏం జరిగింది? ప్రత్యక్షప్రసారాలు నిలిపివేయడంతో ప్రజలకి మొత్తం ప్రసారాలు చూసే అవకాశం కలగలేదు. జగన్ , చంద్రబాబు నాయుడులు తనకనుకూలమైన క్లిప్పింగ్ లనే విడుదలచేశారు. అసలు ప్రసారాలు ఆపే అధికారం ఎవరిది ? కౌన్సిల్ చైర్మన్ దా లేక ముఖ్యమంత్రిదా ? ముఖ్యమంత్రి ప్రసారాలు ఆపివుంటే అధికార దుర్వినియోగం కిందకే వస్తుంది. రెండోవైపు చైర్మన్ చేసిన పని కూడా ఏమీ బాగా లేదు. నిబంధనలకు విరుద్ధంగా విచక్షణాధికారాలు ఉపయోగించాననటం ఎంతవరకు సబబు? రాజ్యాంగంలో వున్న కొన్ని లొసుగులనుపయోగించుకొని చైర్మన్ ని తప్పుదోవ పట్టించినట్లు తెలుస్తుంది. శాసన కార్యక్రమాల్లో తప్పులున్నా కోర్టులు ప్రశ్నించే అధికారం లేదు. ఆ రక్షణని ఉపయోగించుకొని చైర్మన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించేటట్లు ఒత్తిడి తీసుకొచ్చారని అభిప్రాయముంది.
Read More: తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఎన్టీఆర్ బాటలో జగన్?
ఇంతవరకూ బాగానే వున్నా అసలు కదా ఇప్పుడే మొదలయ్యింది. జగన్ కౌన్సిల్ లో జరిగిన విషయాన్ని పరాభవంగా భావించి కౌన్సిల్ రద్దుచేయాలని నిర్ణయించుకున్నాడు. చైర్మన్ ని ప్రభావితం చేసి జగన్ వ్యూహాన్ని దెబ్బతీయగలిగామని తెలుగు దేశం నాయకులు సంబరాలు చేసుకుంటే దానికి ప్రతి వ్యూహాన్ని జగన్ రచించాడు. అసలు కౌన్సిల్ నే రద్దు చేయటానికి సిద్దమయ్యాడు. దీనితో తెలుగుదేశం ఎమ్మెల్సీ ల్లో భయం మొదలయ్యింది. లోలోపల చంద్రబాబు నాయుడు వ్యూహం బెడిసి కొట్టిందని తమ పదవికే ఎసరు వచ్చిందని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. వాళ్ళు పార్టీ మారదామంటే జగన్ తీసుకున్న వైఖరి తో ఇబ్బందయ్యింది. పదవి కి రాజీనామా చేసి వస్తేనే పార్టీలోకి చేర్చుకుంటామని ఇంతకుముందే ప్రకటించటంతో వైస్సార్సీపీ లోకి మారలేరు. మారాలంటే తెలుగుదేశం ఎమ్మెల్సీ ల్లో మూడింట రెండు వంతులు కలిసికట్టుగా మారాలి. అది సాధ్యంకాకపోవచ్చు. అందుకే ముందు గొయ్యి వెనక నుయ్యి లాగా అయ్యింది తెలుగుదేశం ఎమ్మెల్సీల పరిస్థితి. ఈ లోపల మీకేమీకాదని చంద్రబాబు హామీ ఇస్తున్నాడు. ఒకవేళ అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేసినా కేంద్రం సహకరించిందని చెబుతున్నాడు. అయితే అది ఎమ్మెల్సీలను పూర్తిగా నమ్మించలేకపోతుంది. అందుకే ఎమ్మెల్సీలు చాలా టెన్షన్ లో వున్నారు. వాళ్లకు చంద్రబాబు హామీ మీదకన్నా జగన్ కక్షసాధింపు మీద గురి వుంది. దానితో వాళ్ళందరూ పైకి గంభీరంగా వున్నా లోలోపల ఏంచేయాలో తెలియక సతమతమవుతున్నారు. వచ్చే రెండు రోజుల్లో ఏమైనా జరగకపోతుందా అని ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్సీలది త్రిశంకుస్వర్గం.