
ఏపీ రాజధాని మార్చలన్న నిర్ణయం తీసుకున్నా దెగ్గర నుంచి ప్రతిపక్షాలు ఒక కొత్త విషయం తెరపైకి తెస్తున్నారు. సెక్రటేరియటు మార్చినంత మాత్రాన విశాఖపట్నం ఏమి అభివృద్ధి చెందుతుంది……హై కోర్ట్ కర్నూలులో పెట్టినంత మాత్రాన కర్నూలుకి వచ్చే లాభం ఏంటి..? అని చాలా బలంగా ప్రశిస్తున్నారు.
నిజమే.. వాటి వల్ల అభివృధి రానప్పుడు అవి ఎక్కడ ఉంటె ఏంటి? అవి అమరావతిలో ఉంటె ఏంటి విశాఖపట్నంలో ఉంటె ఏంటి!
ఎలాంటి అభివృద్ధి రాకపోతే వాటి చుట్టూ మీరు రాజకీయాలు ఎందుకు చేస్తున్నట్టో….. అవి ఎక్కడ ఉంటె మీ బాధ ఏంటో ప్రజలకి అర్ధం కావటం లేదు. ఒక మాట అనే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు అంటున్నట్టు సెక్రటేరియటు మరియు హై కోర్ట్ వల్ల అభివృధి రావటం కష్టమైతే వాటి గురించి ఆలోచించటం మానేసి ఇంకో పని ఏమైనా చూసుకుంటే మంచిది. సమయం విలువైనది అలాంటి సమయాన్ని వృధా చేసుకోకుండా జనాలు ఉపయోగపడే పనులు చేస్తే… నమ్మి ఓట్లు వేసిన జనాలు సంతోషిస్తారు.