రెవిన్యూ బిల్లుపై బీజేపీ సెల్ఫ్ గోల్

బీజేపీ తెలంగాణ రాష్ట్రం లో అధికారం లోకి రావాలని ఉవిళ్ళూరుతుంది. కెసిఆర్ కి తామే ప్రత్యామ్నాయమని ప్రచారం చేసుకుంటుంది. అందులో కొంత వాస్తవమున్న మాట నిజం. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ దీపం కునారిల్లుతున్న సమయం లో రాజకీయనాయకులు అందులో కొనసాగటానికి ఇష్టపడటం లేదు. బీజేపీ కి వలసలు అన్నిచోట్లా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే తెలంగాణా లో కూడా వలసలపర్వం మొదలయ్యింది. త్వరలో మరికొంతమంది నాయకులు చేరబోతున్నారని వార్తలొస్తున్నాయి. అంతవరకూ బాగానే వుంది. కాంగ్రెస్ కు బదులు […]

Written By: admin, Updated On : February 8, 2020 10:29 am
Follow us on

బీజేపీ తెలంగాణ రాష్ట్రం లో అధికారం లోకి రావాలని ఉవిళ్ళూరుతుంది. కెసిఆర్ కి తామే ప్రత్యామ్నాయమని ప్రచారం చేసుకుంటుంది. అందులో కొంత వాస్తవమున్న మాట నిజం. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ దీపం కునారిల్లుతున్న సమయం లో రాజకీయనాయకులు అందులో కొనసాగటానికి ఇష్టపడటం లేదు. బీజేపీ కి వలసలు అన్నిచోట్లా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే తెలంగాణా లో కూడా వలసలపర్వం మొదలయ్యింది. త్వరలో మరికొంతమంది నాయకులు చేరబోతున్నారని వార్తలొస్తున్నాయి. అంతవరకూ బాగానే వుంది. కాంగ్రెస్ కు బదులు బీజేపీ కెసిఆర్ కి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు మెండుగా వున్నాయి. కానీ కెసిఆర్ లాంటి రాజకీయ చాణిక్యుడుని ఓడించాలంటే అదొక్కటే సరిపోదు. సరైన ఎత్తుగడలు తీసుకోకపోతే ప్రతిపక్షం లో కాంగ్రెస్ కి బదులు బీజేపీ ఉంటుంది. అక్కడే నాయకత్వ సమర్ధత తో అవసరముంది.

ఇప్పటికే కెసిఆర్ బీజేపీ ని ఇరకాటం లో పెట్టే పనికి సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తుంది. దానికి కావాల్సిన ప్రచార ఆయుధాలను రెడీ చేసుకుంటున్నాడు. ఉదాహరణకు గత లోక్ సభ లో అమిత్ షా తెలంగాణ విభజన ప్రక్రియపై కాంగ్రెస్ నిర్వాకాన్ని ఎండగట్టిన తీరుపై బీజేపీ ని తెలంగాణ వ్యతిరేకిగా ముద్రవేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నిధుల విషయం లో కేంద్రం తెలంగాణ పై సీత కన్ను వేసిందని ప్రచారం చేస్తున్నారు. ఇంకా ఇటువంటి ప్రచారాన్ని రాను రానూ ముమ్మరం చేస్తారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందుకనే కాంగ్రెస్ ని బలహీనపర్చటం వేరు, బలమైన ప్రాంతీయపార్టీని ఎదుర్కోవటం వేరు. బీజేపీ ఇక్కడే జాగ్రత్తగా అడుగులు వేయకపోతే శాశ్వతంగా ప్రతిపక్షం లో వుండే అవకాశం వుంది.

ఉదాహరణకు కెసిఆర్ నూతన రెవిన్యూ బిల్లును ప్రవేశపెట్టబోతున్నాడు. దానిపై బీజేపీ దాడిని ముమ్మరం చేసింది. అవసరమైతే కోర్టు కైనా వెళ్తామని ప్రకటించింది. ఈ విషయం లో బీజేపీ పప్పులో కాలేస్తుందనిపిస్తుంది. ఎందుకంటే రెవిన్యూ శాఖ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుంది. అంత అవినీతి శాఖ మరొకటిలేదు. ఈ ప్రజల సెంటిమెంటును రెవిన్యూ శాఖ ప్రక్షాళన ద్వారా కె%