https://oktelugu.com/

మోదీ జిమిక్కులతో బిజెపిని ఓడించిన కేజ్రీవాల్ !

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడోసారి ఘన విజయం సాధిండానికి బిజేపికి అనూహ్య విజయాలు తీసుకు రావడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుసరించినా గిమ్మిక్ లనే ప్రయోగించినట్లు స్పష్టం అవుతున్నది. మోదీ బాటలో నడిచి బిజెపికి ఖంగు తినిపించారు. భావోద్వేగాల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందడంలో అలవాటు పడిన పార్టీ బీజేపీ నేతలు వివాదాస్పద ప్రసంగాలు చేస్తూ మొత్తం ప్రచారాన్ని కేజ్రీవాల్ కు అనుకూలంగా […]

Written By: , Updated On : February 15, 2020 / 01:25 PM IST
Follow us on


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడోసారి ఘన విజయం సాధిండానికి బిజేపికి అనూహ్య విజయాలు తీసుకు రావడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుసరించినా గిమ్మిక్ లనే ప్రయోగించినట్లు స్పష్టం అవుతున్నది. మోదీ బాటలో నడిచి బిజెపికి ఖంగు తినిపించారు.

భావోద్వేగాల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందడంలో అలవాటు పడిన పార్టీ బీజేపీ నేతలు వివాదాస్పద ప్రసంగాలు చేస్తూ మొత్తం ప్రచారాన్ని కేజ్రీవాల్ కు అనుకూలంగా మలచడంలో తోడ్పడ్డారని చెప్పవలసి ఉంటుంది. ‘గోలీ మారో (కాల్చి పారేయండి)’, ‘ఇది ఇండో-పాకిస్థాన్‌ మ్యాచ్‌’ వంటి విద్వేష వ్యాఖ్యలు తమ పార్టీ నేతలు చేసి ఉండాల్సింది కాదని.. ఆ ప్రసంగాలే తమకు నష్టం చేసి ఉంటాయని అమిత్‌షా సహితం పేర్కొన్నారు.

వ్యక్తిగత విమర్శలను ఆసరా చేసుకొని ప్రజల నుండి సానుభూతి పొందే వ్యూహాన్ని మోదీ అడుగుజాడలను అనుసరించి కేజ్రీవాల్ మరోసారి ప్రజల మద్దతు చూరగొన్నారు. ఉదాహరణకు 2014 ఎన్నికల ముందు మోదీని `ఛాయివాలా’ అంటూ కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేస్తే `చాయి పే చర్చ’ అంటూ దేశ వ్యాప్తంగా ప్రచారంలో మోదీ సంచలనం కలిగించడం తెలిసిందే.

అదే విధంగా, రాహుల్ గాంధీని `చౌకీదార్’ అంటూ ప్రధాని మోదీని ఎగతాళి చేసే ప్రయత్నం చేస్తే ట్విట్టర్ లో తన పేరు ముందు `చౌకీదార్’ అనే పదాన్ని ప్రధాని జత చేసుకున్నారు. అదే వరవడిని కేంద్ర మంత్రులు, పార్టీ నాయకులు అనుసరించి ప్రజలలో పెద్ద చర్చకు దారితీశారు.

అదే వ్యూహాన్ని అనుసరించిన కేజ్రీవాల్, బీజేపీ ఎంపీ పారవేశ్ వర్మ తనను “ఉగ్రవాది” గా ఆరోపిస్తే, ప్రత్యారోపణలు చేయలేదు. “నేను ఉగ్రవాదినా?” అంటూ సభలలో అడిగారు. వారంతా “కాదు” అంటూ సమాధానం ఇచ్చారు. ఈ విషయమై ప్రజలకే వదిలివేస్తున్నాను అంటూ నిజంగా తాను ఉగ్రవాదిని అయితే బీజేపీ గుర్తు కమలంకే ఓట్ వేయమని చెప్పారు.

ఈ అంశంపైననే ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగొట్టారు. ఆ రోజున తనకు ఇంటికి వెళ్ళగానే తన ముసలి తల్లితండ్రులు ఈ విషయం ప్రస్తావించారని, “నీవు ఉగ్రవాదివి కావు, పక్క దేశభక్తి గలవాడిని” అంటూ మెచ్చుకున్నారని అంటూ చెప్పారు.

ఎన్నికల సమయంలో మతం కార్డు ను తెలివిగా ఉపయోగించడంలో నరేంద్ర మోదీ సిద్దహస్తులు. ఉదాహరణకు, 2019 ఎన్నికలలో చివరి దశ ఓటింగ్ కు ముందు కేదారనాథ్ కు వెళ్లి, కాషాయ వస్త్రధారణతో ఒక గుహలో రాత్రి అంతా ఉండి, ధాన్యం చేసుకున్నారు. ఈ ఫోటోలు మీడియాలో విస్తృతంగా వచ్చేటట్లు చూసారు.

అదే వరవడిని, కేజ్రీవాల్ కూడా అనుసరించారు. ఓటింగ్ కు ముందు రోజు కుటుంభం సభ్యులతో కలసి హనుమాన్ దేవాలయం సందర్శించారు. ఓటింగ్ రోజున నుదిటి బొట్టు ధరించారు. ఆ విధంగా ఒక విధంగా బిజెపి సానుభూతి పరుల ఓట్లను కూడా కైవసం చేసుకున్నారు.

ఎన్నికల సమయంలో మోదీ తన వ్యక్తిగత విశ్వాసాల ద్వారా ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేస్తారు. గతంలో గుజరాత్ ఎన్నికల సమయంలో సహితం ఓటింగ్ రోజున తల్లి పాదాలకు వెళ్లి నమస్కారం చేసేవారు. అదే విధంగా కేజ్రీవాల్ సహితం ఓటింగ్ కు వెళ్లే ముందు తల్లితండ్రుల పాదాలు నమస్కారం చేశారు.

మోదీ మొత్తం ఎన్నికల ప్రచారం తన చుట్టూ జరిగేటట్లు చూసుకుంటారు. తనకు, మిగిలిన అన్ని ప్రతిపక్షాలకు మధ్య పోరాటంగా కనిపించేటట్లు చేస్తారు. అంటే గాని వివిధ పార్టీల మధ్య రాజకీయ పోరాటంగా ప్రజలు భావించే ప్రయత్నం చేయరు. కేజ్రీవాల్ కూడా అదే చేశారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సోనియా గాంధీ ఆయనను `మృత్యు వ్యాపారి’ అంటూ నిందించగా, దానిని `గుజరాత్ ప్రతిష్ట’ అంశంగా మోదీ మారారు. ఆమె ఆరోపణలకు ఆరు కోట్ల గుజరాతీ ప్రజలు సమాధానం ఇవ్వాలని కోరారు.

అదే విధంగా, 2019 ఎన్నికలకు ముందు ఫుల్వమా ఉగ్రదాడికి సమాధానంగా బాలకోట వద్ద ఉగ్రవాద శిబిరాలను ధ్వసం చేసిన్నట్లు ప్రకటించగా, అందుకు సాక్ష్యం ఏమిటని ప్రతిపక్షాలు విమర్శలు కురిపించాయి. 130 కోట్ల మంది భారత ప్రజలే సాక్ష్యమని అంటూ ప్రధాని తిప్పి కొట్టారు.

అదే తరహాలో బీజేపీ నాయకులు తపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలను ప్రస్తావిస్తూ ఇది రెండు కోట్లమంది ఢిల్లీ పౌరులకు, బీజేపీకు మధ్య జరుగుతున్న పోరాటంగా కేజ్రీవాల్ అభివర్ణించారు.

బిజెపి ఆరోపణలకు రెండు కోట్ల మంది ప్రజలు సమాధానం ఇవ్వాలని కోరారు. ఆ విధంగా ఈ ఎన్నికను రెండు పార్టీల మధ్య పోరాటంగా కాకుండా, తనకు, ఇతర పార్టీల మధ్య జరుగుతున్న పోరాటంగా వ్యక్తిగత స్థాయికి తీసుకు వెళ్లడం ద్వారా ప్రజల సానుభూతి పొందారు.