తెలంగాణలో జరిగిన దిశ ఘటనతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ “దిశ చట్టం” తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. ఈ చట్టం అమలుకోసం జగన్ సర్కార్ అడుగులు వేస్తుంది. ఇటీవల దిశ పోలీస్ స్టేషన్, దిశ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన విషయం, అలాగే “దిశ యాప్” ని లాంచ్ చేసిన విషయం తెలిసిందే..
ఈ యాప్ ఇంటర్నెట్ తో సంబంధం లేకుండా పనిచేయడం గమనార్హం. మొబైల్ ఫోన్‌లో “దిశ యాప్”ని ఓపెన్ చేసి ఎస్‌వోఎస్ బటన్ నొక్కితే… ఆ ఫోన్ లొకేషన్ పూర్తి వివరాలు పోలీసు కంట్రోల్ రూమ్‌కు వెళ్తాయి. దీని వల్ల మహిళలకు మరింత రక్షణ చేకూరే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యాప్‌తో దగ్గర్లోని ఆసుపత్రులు, బ్లడ్‌బ్యాంక్ వివరాలు తెలుసుకోవచ్చు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే కుటుంబ సమస్యలతో సతమతమయ్యే వారు కూడా ఈ యాప్ ఉపయోగిస్తున్నారు.
గడిచిన 4రోజుల్లోనే “దిశ యాప్”ను 50 వేల మంది డౌన్‌లోడ్ చేసుకొని, యాప్ పనితీరుకు, పోలీసులు స్పందిస్తున్న తీరుకు గూగుల్ ప్లేస్టోర్‌లో 5కి ఏకంగా 4.9 స్టార్ రేటింగ్ ఇవ్వడం గమనార్హం.