కామన్ సివిల్ కోడ్ పై మోదీ వెనుకడుగు!

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దూకుడుగా సంచలనాత్మక బిల్లులను తీసుకు వస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కామన్ సివిల్ కోడ్ (సిఏఏ) బిల్ ను తీసుకు రావాలనే విషయమై వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తున్నది.   తన సొంత పార్టీ వారికి కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా గత రెండు పార్లమెంట్ సమావేశాల్లో హోమ్ మంత్రి అమిత్ షా రెండు సంచలన బిల్లులు తీసుకువచ్చి, దేశంలో పెద్ద కలకలం సృష్టించడం తెలిసింది. గత […]

Written By: admin, Updated On : February 10, 2020 10:34 am
Follow us on

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దూకుడుగా సంచలనాత్మక బిల్లులను తీసుకు వస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కామన్ సివిల్ కోడ్ (సిఏఏ) బిల్ ను తీసుకు రావాలనే విషయమై వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తున్నది.

 

తన సొంత పార్టీ వారికి కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా గత రెండు పార్లమెంట్ సమావేశాల్లో హోమ్ మంత్రి అమిత్ షా రెండు సంచలన బిల్లులు తీసుకువచ్చి, దేశంలో పెద్ద కలకలం సృష్టించడం తెలిసింది. గత ఆగస్టు లో కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేసే బిల్ తీసుకు రాగా, శీతాకాలం సమావేశాల్లో గత డిసెంబర్ లో పౌరసత్వ సవరణ బిల్లును తీసుకొచ్చారు.

 

అయితే అందుకు తగిన పూర్వరంగాన్ని క్షేత్ర స్థాయిలో ఏర్పాటు చేయలేక పోవడంతో ఆ చట్టాలు సృస్టిస్తున్న అలజడులు నుండి ఇంకా బయటపడలేక పోతున్నారు. కాశ్మీర్ లోయలో ఇంకా పరిస్థితులు నివురుగప్పిన నిప్పు వలే ఉన్నాయి. సీఏఏ వ్యతిరేక నిరసనలు సుమారు రెండు నెలలవుతున్నా తగ్గుముఖం పట్టడం లేదు.

 

అదే ఒరవడిలో ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో కామన్ సివిల్ కోడ్ బిల్ తీసుకు రావడానికి అమిత్ షా రంగం సిద్ధం చేసుకున్నా ప్రస్తుతం దేశంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా ప్రధాని మోదీ తొదరపడొద్దని వారించినట్లు చెబుతున్నారు.

 

కాశ్మీర్ లో ప్రశాంతత నెలకొన్నదని చూపడం కోసం గత నెలలో పలువురు కేంద్ర మంత్రులను అక్కడకు పంపినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. సిఏఏ అనుకూలం ప్రచారం అంటూ మంత్రులందరినీ పంపిణీ చెప్పుకోదగిన స్పందన కనిపించలేదు. దానితో వ్యూహం మార్చే ఆలోచనలో ఉన్నారు.