ఇక తెలంగాణాలో జోరుగా ‘నీరా’ అమ్మకాలు

నీరా , ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది కల్లు చెట్టు నుంచి తీసిన ద్రవం. కొద్దిసేపు బయటవుంచగానే కల్లుగా మారుతుంది. ఇప్పుడు కెసిఆర్ గారికి కొత్త ఆలోచన వచ్చింది. కెసిఆర్ గారు కళ్ళు దుకాణాలను ఎక్కడబడితే అక్కడ పెట్టిండు, జనం చెడిపోతుండ్రు అని అందరూ అనుకుంటుంటే జర బాధఒచ్చిందంట . అరె భాయ్ ఇదేంది నేనోదో పాపం మంచిచేస్తుంటే అందరూ నన్ను ఆడిపోసుకుంట్రుండు. అరె తెలంగాణా ని గురించి ఈళ్ళకేం తెలుసు. కల్లు తాగటం […]

Written By: admin, Updated On : February 8, 2020 10:54 am
Follow us on

నీరా , ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది కల్లు చెట్టు నుంచి తీసిన ద్రవం. కొద్దిసేపు బయటవుంచగానే కల్లుగా మారుతుంది. ఇప్పుడు కెసిఆర్ గారికి కొత్త ఆలోచన వచ్చింది. కెసిఆర్ గారు కళ్ళు దుకాణాలను ఎక్కడబడితే అక్కడ పెట్టిండు, జనం చెడిపోతుండ్రు అని అందరూ అనుకుంటుంటే జర బాధఒచ్చిందంట . అరె భాయ్ ఇదేంది నేనోదో పాపం మంచిచేస్తుంటే అందరూ నన్ను ఆడిపోసుకుంట్రుండు. అరె తెలంగాణా ని గురించి ఈళ్ళకేం తెలుసు. కల్లు తాగటం నేను నేర్పించానా? గది జమానా నుంచి వుంది. పాపం పగలంతా కష్టపడి పొద్దుగాల ఏదో కొంత ఖుషీ చేసుకుంటుంటే దీన్ని కూడా ఎగతాళి చేస్తుండ్రు. వీళ్లంతా తెలంగాణా ద్రోహులు.

కెసిఆర్ ఈమధ్య పరేషాన్ అవుతున్నాడు. ఇదేంది భాయ్ జగన్ నా దోస్తు అనుకుంటే నాకు రోజూ తలనొప్పి తెస్తుండు . ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేశాడు. దిమాక్
వున్నోడు ఎవడన్నా చేస్తాడా ఆ పని. ఆయన చేసి నన్ను పరేషాన్ చేస్తుండు. ఆయన్ని చూసి మావాళ్లు ఒళ్ళు కాల్చుకుంటున్నారు. నాబొందిలో ప్రాణముండగా నేనయితే ఒప్పుకోను. డబ్బులు ఊరకే రావుకదా . వాడెవడు ఆ గుండు గాడు రోజూ యాడ్ లో చెబుతాడుకదా. డబ్బులు చెట్లకు కాయవు కదా. పెట్టుకోక పెట్టుకోక నాతోనే పెట్టుకున్నారు. అసలు ఆర్టీసీ ఎత్తయినైనా ఎత్తేస్తాను కానీ ఈ బుడింగ్ లకు లొంగను కాక లొంగను.

ఈ జగన్ ఏందీ రోజుకొక తలనొప్పితెచ్చి పెడుతుండు. అదేంది లిక్కర్ బ్యాన్ చేస్తాడంట. దిమాక్ ఖరాబయ్యిందా . నాకు దోస్తు కాదు దుష్మన్ అయి కూచున్నాడు. లిక్కర్ ఎక్కడైనా సక్సెస్ అయిందా? నాతో పాటు గుజరాత్ రమ్మను , ఎంత కావాలంటే అంత లిక్కర్ దొరికిద్ది. కుర్రోడు నన్నడగొచ్చు కదా , పనికిమాలిన పనులు చేస్తున్నాడు. నన్ను పరిషాన్ చేస్తుండు. దీనికో కౌంటర్ వేస్తాను. కల్లు దుకాణం పెడితే గొడవ చేస్తున్నారు. నీరా సప్లై చేస్తే . దాంట్లో ఆల్కహాల్ ఉండదు. మన గౌడు సోదరులకు ఆదాయమొస్తుంది. అప్పుడు నన్నేం పీకుతారోచూద్దాం. నన్ను దెబ్బ తీయాలనుకుంటే జరిగిద్దా ? నాకున్న ఐడియాలు ఎవరికీ లేవు. అసలు జనం దుకాణం కి ఎందుకు రావాలి? మనమే సాచెట్లు తయారుచేసి షాపుల్లో పెట్టేస్తే పొయ్యే . కల్లు కి పదిరెట్లు అమ్మకాలు పెరుగుతాయ్ . ఎలా వుంది నా తడాఖా.

అంతాబాగానే ఉందికానీ నీరా కల్లుగా మారిందో లేదో తనిఖీ చేయటమెట్లా? క్వాలిటీ ఇన్స్పెక్టర్లను పెడితే పోయే . మరి వీళ్లకు అర్హత ఏమిటి? ఏముందీ కల్లు తాగే అలవాటుంటే చాలు. రోజుకి ఫ్రీగా ఎంతైనా తాగొచ్చు. మాములుగా తాగి ఆఫిసుకి రాకూడ దంటారు, కానీ ఈ ఉద్యోగానికి తాగితేనే ఆఫీసు. ఇటు వేలమందికి ఉద్యోగాలు, అటు నీరా అమ్మకాలతో ఆదాయం. కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా నీరా అమ్ముతుందంట గదా. వాళ్ళు అమాయకులు లిక్కర్ కిందనే అమ్ముతున్నారు. కెసిఆర్ లాగా జ్యూస్ లాగా అమ్మటంలేదు. మరి కెసిఆర్ కున్న తెలివితేటలు పిన్నరాయి విజయన్ కు లేవాయే . ఏమైనా కెసిఆర్ ముందు ఎవరైనా దిగదుడుపే.