Ashwin – Jadeja : భారత స్పిన్ ద్వయం అరుదైన రికార్డును సృష్టించింది. ఈ జంట మన సీనియర్ల రికార్డును అధిగమించేసింది. హైదరాబాద్‌లో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో ఇంగ్లాండ్‌తో టీమ్ ఇండియా తలపడుతోంది. హైదరాబాద్ స్పిన్ పిచ్ కావడంతో గురువారం ఆటలో రెండు వైపులా ముగ్గురు ఫ్రంట్‌లైన్ టీమిండియా స్పిన్నర్లు బౌలింగ్ చేశారు. వికెట్లు తీసి ఈ రికార్డు సృష్టించారు.
పిచ్‌పై టాస్ గెలిచిన తర్వాత ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ మొదట పేసర్లు జస్ప్రీత్ బుమ్రా , మహ్మద్ సిరాజ్‌లతో బౌలింగ్ దాడిని ప్రారంభించింది, అయితే ఈ ఫాస్ట్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేదు. పరుగులు ధారళంగా వచ్చేశాయి. దీంతో ఆట తొమ్మిదో ఓవర్ తర్వాత స్పిన్నర్లను రంగంలోకి దించాడు రోహిత్. అప్పటి వరకు, ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో దూకుడుగా దూసుకెళ్లింది, అయితే స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్ , రవీంద్ర జడేజా టాప్ ఆర్డర్‌పై విరుచుకుపడి త్వరగా మూడు వికెట్లు తీసేశారు. దీంతో ఇంగ్లండ్ స్పీడ్ కు అడ్డుకట్టపడింది.
అశ్విన్ ఇద్దరిని ఔట్ చేయగా.. జడేజా నం.3 బ్యాటర్ ఆలీ పోప్‌ను అవుట్ చేశాడు; మూడో వికెట్ పడిన వెంటనే – అశ్విన్ 20 పరుగుల వద్ద జాక్ క్రాలీని అవుట్ చేయడంతో దిగ్గజ భారత స్పిన్ ద్వయం కొత్త భారతీయ రికార్డును సృష్టించింది. అశ్విన్ -జడేజా జంట భారతదేశంలో అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన జంటలైన అనిల్ కుంబ్లే -హర్భజన్ సింగ్‌లను అధిగమించి అగ్రస్థానంలో ఉన్నారు.
ఇంగ్లండ్ తో టెస్టు ప్రారంభానికి ముందు భారత మాజీ స్పిన్ జంట (503 వికెట్లు) కంటే భారత ద్వయం అశ్విన్-జడేజాలు ఒక వికెట్ వెనుకబడి ఉన్నారు. ఇక మూడవ స్థానంలో హర్భజన్ – పేసర్ జహీర్ ఖాన్‌తో కలిసి 474 వికెట్లు తీసుకొని ఉన్నారు.
అంతర్జాతీయ క్రికెట్లో, జేమ్స్ ఆండర్సన్ – స్టువర్ట్ బ్రాడ్ల ప్రఖ్యాత ఇంగ్లీష్ ద్వయం 1039 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును కలిగి ఉన్నారు. యాషెస్ 2023 తర్వాత బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మెక్‌గ్రాత్ – షేన్ వార్న్ సుదీర్ఘ ఫార్మాట్లో వెయ్యికి పైగా వికెట్లు (1001) సాధించిన జంటగా ఉన్నారు..
ఇక ఇంగ్లండ్ తో తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించినట్టే కనిపిస్తోంది. ఇంగ్లాండ్ 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది..అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా రోహిత్ వికెట్ కోల్పోయి 119 పరుగులు చేసింది..
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Ravichandran ashwin ravindra jadeja beat harbhajan kumbles record of most wickets
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com