Jagan : వైఎస్ జగన్, షర్మిల వివాదం పై ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన చెల్లి వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల వివాదంపై వైఎస్ అభిమానులకు జగన్ తల్లి విజయమ్మ బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖలో రాజశేఖర్ రెడ్డి బతికి ఉండగా ఆస్తులను పంచలేదని.. జగన్, షర్మిల మీద కొన్ని ఆస్తులను రాశారని ఆమె స్పష్టం చేశారు. ఆస్తులు ఇద్దరికీ సమానమనేది నిజమని విజయమ్మ చెప్పుకొచ్చారు.
జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదానికి సంబంధించి పలు విషయాలను ఆమె ప్రస్తావించారు. అయితే, వైఎస్ విజయమ్మ లేఖకు కౌంటర్ గా వైసీపీ ఎనిమిది పేజీల లేఖను విడుదల చేసింది. విజయమ్మను అమితంగా గౌరవిస్తాం. వైఎస్ కుటుంబ వ్యవహారంపై విజయమ్మ బహిరంగ లేఖ విడుదల చేసిన నేపథ్యంలో కొన్ని అంశాలను ఆమె ముందుకు, ప్రజల ముందుకు తీసుకువస్తున్నామని లేఖలో ప్రస్తావించారు.
తన సొంత మీడియాలో కొమ్మినేని లాంటి వాళ్లను కూర్చోబెట్టి తన తల్లి, చెల్లెలిపై మాట్లాడించడాన్ని వైఎస్ అభిమానులు పెద్దగా హర్షించబోరని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కూతురి మీద ప్రేమతో విజయమ్మ గుడ్డిది అయిపోయిందన్న వ్యాఖ్యలను వైఎస్ అభిమానులు సహించలేకపోతున్నారు. తను తన భర్త వైఎస్ఆర్ హయాంలో జరిగిన విషయాలను ప్రస్తావిస్తున్నారని ఆమె మద్దతు పలుకుతున్నారు. సొంత తల్లి గురించి సాక్షి మీడియాలో చేస్తున్న ప్రచారం బట్టి చూస్తే తన క్యారెక్టర్ గురించి జనాలకు అర్థం అవుతుంది.
జగన్మోహన్ రెడ్డిని లీగల్ గా ఇబ్బంది పెట్టేందుకు, తద్వారా బెయిల్ రద్దుకు జరిగిన కుట్ర వ్యవహారాన్ని కనీసం విజయమ్మ లేఖలో ప్రస్తావించకపోవడం ప్రజలను పక్కదోవపట్టించడమేనని వైసీపీ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. షర్మిల భావోద్వేగాలకు, ఒత్తిళ్లకు గురై జగన్ కు న్యాయపరంగా, చట్టపరంగా చిక్కులు తెచ్చే కుట్ర జరుగుతుందని తెలిసినా విజయమ్మ ఆమోదించి సంతకం పెట్టడం నిజం కాదా అని జగన్ కోటరి లేఖలో ప్రశ్నిస్తోంది. తల్లి లేఖకు కౌంటర్ గా మరో లేఖతో జగన్.. దీని మీద ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.