https://oktelugu.com/

Yogi Adityanath : 60వేల మందికి పైగా పోలీసు నియమాకాలతో చరిత్ర సృష్టించిన యోగీ ఆదిత్యనాథ్

60వేల మందికి పైగా పోలీసు నియమాకాలతో చరిత్ర సృష్టించిన యోగీ ఆదిత్యనాథ్ పోలీస్ పరీక్షలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : September 2, 2024 / 07:34 PM IST

    Yogi Adityanath : ఉత్తరప్రదేశ్ మరో రికార్డ్ సృష్టించింది. అదీ రిక్రూట్ మెంట్ లో.. దేశంలో అత్యధిక మంది పోటీపడేది రైల్వే ఉద్యోగాలు..రెండో రక్షణ రంగంలో.. ఈ రెండింటికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. యూపీలో ఈసారి పోలీస్ రిక్రూట్ మెంట్ కు విపరీతంగా యువత వచ్చారు. ఎన్నికల ముందర పేపర్ లీకేజీతో ఫిబ్రవరిలో ఈ పోలీస్ ఉద్యోగ నియామకాలు ఆగిపోయాయి. అది ఎన్నికల్లో యూపీలోని యోగీ సర్కార్ కు దెబ్బపడింది.

    అందుకే ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా యోగి పర్సనల్ గా సూపర్ విజన్ తీసుకొని పరీక్షలను ప్రిపేర్ చేశాడు. పరీక్షలకు ముందుగా ‘యూపీ పబ్లిక్ ఎక్సామినేషన్ యాక్ట్ ’ అని తయారు చేసి అందులో శిక్షలు కఠినంగా పెట్టారు. పేపర్ లీకేజీ చేసే వారిని జీవితకాల శిక్షలు వేస్తామని చట్టంలో పొందుపరిచారు.

    5 రోజుల్లో రోజుకు రెండు సార్లు పరీక్షలు నిర్వహించారు. 1.90 లక్షల మంది పోలీసులను మోహరించి పరీక్షలు నిర్వహించారు. దాదాపు 60244 పోసులకు పరీక్షలను చాలా పకడ్బందీగా నిర్వహించారు. దాదాపు 48,17,315 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. డిజిటల్ ఫొటో సేకరణ.. ఐరిస్ స్కాన్ , బయోమెట్రిక్ చెక్స్, ఆధార్ వెరిఫికేషన్, సీసీటీవీలు.. ఆకస్మిక తనిఖీలు.. పెట్టి యుద్ధంలాగా పరీక్షలు నిర్వహించారు.పరీక్ష పేపర్లు దాచే సెంటర్లకు 3 టైర్ సెక్యూరిటీ పెట్టారు. ఈసారి పరీక్ష ఎక్కడా లీకేజీ కాలేదు. స్టూడెంట్స్ అయితే యోగిని ఆకాశానికి ఎత్తేశారు.

    60వేల మందికి పైగా పోలీసు నియమాకాలతో చరిత్ర సృష్టించిన యోగీ ఆదిత్యనాథ్ పోలీస్ పరీక్షలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.