https://oktelugu.com/

Kavitha bail : కవిత బెయిల్ రాజకీయ పార్టీలు నిర్ణయిస్తాయా?

కవిత బెయిల్ రాజకీయ పార్టీలు నిర్ణయిస్తాయా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : August 28, 2024 / 09:48 PM IST

    Kavitha bail : కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడం ఏంటో కానీ.. దాని మీద అర్థం పర్థం లేని వాదనలు, వ్యాఖ్యానాలు వెగటు పుట్టిస్తున్నాయి. బెయిల్ వస్తే సంబరాలు చేసుకునేంత పండుగనా?తీర్పు వచ్చినట్టుగా అందరూ మాట్లాడుతున్నారు. ఆవిడ నిర్ధోషి అయినట్టు.. విజయం సాధించినట్టుగా.. మాట్లాడుతున్నారు.

    ఒకసారి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో వినండి.. ఎటువంటి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడం అన్నది కేసును ప్రభావితం చేసేది కాదు.. జైలు సాధ్యమైనంత ఎవరినీ ఉంచరు.. బెయిల్ కే చూస్తామని.. పీఎంఎల్ చట్టంలోనే మహిళలకు మినహాయింపు ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.

    ట్రయల్ లో వేలమంది సాక్ష్యులను విచారించాలి.. విచారణ సాగాలి.. అన్నాళ్లు ముద్దాయిని జైల్లో పెట్టాల్సిన అవసరం ఉందా? అని సుప్రీంకోర్టు తెలిపింది. ఒకవేళ శిక్ష పడకుంటే ఇన్నాళ్లు కారాగారంలో అన్యాయంగా శిక్షపడినట్టు అవుతుంది కదా.. చాలా కేసుల్లో ఇలాంటి వాదనలు వచ్చాయి.

    దర్యాప్తు జరిగే టైపులో కేసు ప్రభావితం చేస్తారని జైల్లో ఉంచడం సబబు.. కానీ దర్యాప్తు ముగిసి విచారణ సమయంలో బెయిల్ లో ఉంచడం సాధ్యంకాదని సుప్రీంకోర్టు ఈ బెయిల్ మంజూరు చేసింది.

    కవిత బెయిల్ రాజకీయ పార్టీలు నిర్ణయిస్తాయా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.