Yogi Adityanath : ఉత్తరప్రదేశ్.. యోగీ కి ముందు.. యోగీ తర్వాత అని ఎందుకు పిలుస్తున్నారు?

రాజకీయాలు పక్కన పెడితే.. యోగి ఎందుకు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాడో ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : August 28, 2024 12:56 pm

Yogi Adityanath : యోగి ఆదిత్యనాథ్.. రాజకీయాల్లో పెను సంచలనం.. 52 ఏళ్ల యోగి రాజకీయాల్లో పెను సంచలనం.. 2017లో యోగిని మోడీ సీఎంగా చేసినప్పటికి ఆయన గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అప్పటికీ గోరఖ్ పూర్ నుంచి 6 సార్లు యోగి ఎంపీగా ఎన్నికయ్యారు. గోరఖ్ పూర్ మఠాధిపతిగా యోగికి పేరుంది. యూపీలో ఆ ఏరియా వరకే పేరుంది.

మొదటిసారి యోగి 2017లో యూపీ ముఖ్యమంత్రిగా అయ్యారు. వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. యూపీలో కంటిన్యూగా రెండోసారి ముఖ్యమంత్రి గా ఎవరూ కాలేదు. అలాంటిది యోగి అయ్యారు. యోగి ‘ఆర్ఎస్ఎస్’ స్కూల్లో పెరిగిన వ్యక్తి కాదు. అయినా సీఎంగా ఛాన్స్ ఇచ్చారు. ఇటీవల కాలంలో యోగి మీద టీవీల్లో చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి..

హిందువులందరూ ఐక్యం కావాలని మోడీ పిలుపునిచ్చాడు. పోలరైజ్డ్ పర్సన్ అంటూ మీడియాలో వివాదాస్పదంగా మారాడు. బుల్డోజర్ బాబాగా కూడా యోగి పాపులర్ అయ్యాడు. మాటలు, చేతలతో యోగికి మద్దతుదారులు పెరిగారు. యోగిని ద్వేషించే వారు కూడా విపరీతంగా పెరిగారు.

రాజకీయాలు పక్కన పెడితే.. యోగి ఎందుకు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాడో ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.