https://oktelugu.com/

Jammu and Kashmir Elections : ఎందుకు ఎన్నికల్లో రషీద్ ఇంజనీర్ కీలకంగా మారాడు?

జమ్మూకశ్మీర్ లో ప్రస్తుతం రషీద్ ఇంజనీర్ వైపే అందరి చూపు నెలకొంది. ఎందుకు ఎన్నికల్లో రషీద్ ఇంజనీర్ కీలకంగా మారాడు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : September 13, 2024 8:10 pm

    Jammu and Kashmir Elections : కశ్మీర్ ఎన్నికలు వచ్చే బుధవారం (18వతేదీన ) మొదటి దశ పోలింగ్ జరుగబోతోంది. ఉగ్రవాదానికి పట్టున్న సౌత్ కశ్మీర్ పుల్వామా, సోఫియాన్, అనంతనాగ్, పుల్గాంలలో ఎన్నికలు జరుగబోతున్నాయి. జమ్మూకశ్మీర్ లోని 90 సీట్లకు బీజేపీ పోటీచేయడం లేదు.. బీజేపీ కశ్మీర్ లో ఎలాంటి వ్యూహాన్ని రూపొందిస్తోంది అన్నది ఆసక్తికరంగా మారింది. 43 జమ్మూలోని సీట్లలో పోటీచేస్తోంది. కశ్మీర్ వ్యాలీలో 47 సీట్లున్నాయి. బీజేపీ ఇక్కడ నార్త్ కశ్మీర్ లో కేవలం 5 సీట్లలోనే పోటీచేస్తోంది. శ్రీనగర్ లో 5 సీట్లు, సౌత్ కశ్మీర్ లో 8 పోటీచేస్తోంది. మొత్తం 19 సీట్లకే పోటీచేస్తోంది. 28 సీట్లలో అసలు పోటీచేయడం లేదు. క్యాడర్ నిరుత్సాహంగా ఉంది. నేతలు ఆందోళన చెందుతున్నారు.

    బీజేపీ వ్యూహం ఏంటి అన్నది ఆసక్తిరేపుతోంది. జమ్మూలో కాన్ సన్ ట్రేట్ చేస్తోంది. బలమైన ఈ ప్రాంతంలోనే ప్రచారం చేస్తోంది. ఇక్కడ ఎంత ఎక్కువ ఫోకస్ పెడితే సీట్లు అన్ని ఎక్కువ అవుతాయి. జమ్మూలో 25 సీట్లు బీజేపీకి వచ్చాయి. ప్రస్తుతం 43 సీట్లలో 30-35 సీట్లకు బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. ఇందులోని ముస్లిం డామినేట్ ఏరియాలో పోటీచేయడం లేదు.

    ఇక బీజేపీ బలం లేని చోట ప్రత్యర్థి పార్టీలను బలహీన పరిచే ఎత్తుగడను బీజేపీ ఎంచుకుంది. అందుకే పోటీచేయకుండా ప్రత్యర్థులపై బలవంతులను ప్రయోగించే ఎత్తుగడ చేస్తోంది.

    జమ్మూకశ్మీర్ లో ప్రస్తుతం రషీద్ ఇంజనీర్ వైపే అందరి చూపు నెలకొంది. ఎందుకు ఎన్నికల్లో రషీద్ ఇంజనీర్ కీలకంగా మారాడు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

    ఎందుకు ఎన్నికల్లో రషీద్ ఇంజనీర్ కీలకంగా మారాడు? | Rashid Engineer | Jammu and Kashmir Elections 2024