Modi : మోడీకి మెజారిటీ తగ్గటం, అయోధ్య సీటు ఓడిపోవటం దేనికి సంకేతం?

మోడీకి మెజారిటీ తగ్గటం, అయోధ్య సీటు ఓడిపోవటం దేనికి సంకేతం? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : June 6, 2024 2:38 pm
Follow us on

Modi : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. మోడీ బీజేపీ పార్టీకి ఈసారి సొంతంగా మెజార్టీ రాకపోవడానికి ప్రధానంగా మూడు రాష్ట్రాల్లో వెనుకబడడం కారణం. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బెంగాల్. ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా ఇక్కడ రియల్ ఫలితాలు వచ్చాయి.

ఉత్తరప్రదేశ్ లో ఈసారి బీజేపీకి భారీ నష్టం వాటిల్లింది. పోయినసారి 62 ఎంపీ సీట్లు ఒక్క బీజేపీకే వచ్చాయి. ఈసారి 36 ఎంపీ సీట్లు మాత్రమే యూపీలో బీజేపీ సాధించింది. ఇక్కడే 26 సీట్లు కోల్పోయింది.

పోయినసారి కంటే ఈసారి యూపీలో బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని అన్ని సర్వే సంస్థలు చెప్పినా ఇంత దారుణంగా పడిపోవడానికి కారణాలు విశ్లేషించుకుందాం.

బీజేపీ యూపీలో కొత్త సీట్లు సాధించేకన్నా ఉన్న ఎంపీ సీట్లను నిలబెట్టుకున్నా ఇప్పుడు కేంద్రంలో సొంతంగా అధికారంలోకి వచ్చేది. సొంతకాళ్లపై నిలబడేది. దానికి ప్రధాన కారణమైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఒక్క సర్వే సంస్థ కూడా యూపీలో బీజేపీకి తగ్గుతాయని ఎవ్వరూ ఊహించలేదు.

మోడీకి మెజారిటీ తగ్గటం, అయోధ్య సీటు ఓడిపోవటం దేనికి సంకేతం? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.