https://oktelugu.com/

Waqf Laws : మిగతా మత చట్టాలకి వక్ఫ్ చట్టం ఎందుకు భిన్నంగా వుంది?

మిగతా మత చట్టాలకి వక్ఫ్ చట్టం ఎందుకు భిన్నంగా వుంది? అన్న దానిపై ‘రామ్ ’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : August 6, 2024 / 05:49 PM IST

    Waqf Laws : ఆస్తి ఎక్కడ ఎక్కువ ఉంటే తగాదాలు.. వివాదాలు అక్కడే ఉంటాయి. దేశంలో రైల్వేలు, రక్షణ రంగాలు తర్వాత అత్యంత ఆస్తి ఉన్న సంస్థలు ఏవైనా అంటే ‘వక్ఫ్ బోర్డులు’.. దేశంలో అతిపెద్ద ఆస్తులు వక్ఫ్ బోర్డు వద్ద ఉన్నాయి. సుమారు 8.7 లక్షల స్థిరాస్థులు.. 9 లక్షల కు పైగా ఎకరాల భూమి ఉంది. ఎక్కువ భాగం నగరాల నడిబొడ్డుల్లో.. విలువైన భూమి ఉంది.. ఇది లక్షల కోట్లలో ఉంది.

    ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. దీని మీద వచ్చే ఆదాయం ఎంతంటే 200 కోట్లు మాత్రమే.. ఎంతమంది దీన్ని అనుభవిస్తున్నారో తెలుసా? కేవలం 200మందికే దీనిపై అధికారం ఉంది. 32 వక్ఫ్ బోర్డులు ఉంటే..యూపీలో మాత్రమే సున్నీ, షియాలకు వేరు వేరుగా ఉంది.

    ఇన్ని లక్షల కోట్ల ఆస్తులున్న చోట ఎవరు పడితే వారు సొంతానికి వాడుకుంటే దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందుకే ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది. వక్ఫ్ బోర్డులో ప్రభుత్వం సంస్కరణలు తీసుకొస్తోంది. ఇవి ముస్లింలకు వ్యతిరేకం అన్నది ప్రతిపక్షాల ఆరోపణ మాత్రమే. ఈ లక్షల కోట్ల ఆదాయం పేద ముస్లిం మహిళలు, పిల్లలకు చేరాలన్నది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది.

    మిగతా మత చట్టాలకి వక్ఫ్ చట్టం ఎందుకు భిన్నంగా వుంది? అన్న దానిపై ‘రామ్ ’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.