https://oktelugu.com/

India : నౌకా రవాణా లో భారత్ ఎందుకు వెనకబడింది?

లార్జెస్ట్ పోర్ట్ దేశంలో అదానీ ముంద్రా పోర్ట్. నౌకా రవాణా లో భారత్ ఎందుకు వెనకబడింది? అన్న దాని పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : September 10, 2024 / 11:24 AM IST

    India : నౌకా రవాణా.. భారత్ ప్రపంచ పటంలో ఎందుకు వెనకబడింది. ఒకనాడు భారత్ ప్రపంచ పటంలో చాలా ముందు ఉండేది. చోళుల టైంలో చైనా వరకూ, అరబ్బులతో వ్యాపారం చేశారు. రోమన్ సామ్రాజ్యంతో వ్యాపారం చేశారు. బ్రిటీష్ వారి వల్ల మొత్తం కొట్టుకుపోయింది.

    స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు అయినా నౌకా రవాణా ఇప్పటికీ పెరగలేదు.మన ఎగుమతులు పెరగాలంటే.. ముందుగా క్వాలిటీ ప్రోడక్ట్స్ తయారు కావాలి. అంతకన్నా ముఖ్యమైన మౌళిక సదుపాయం పోర్టులు కావాలి. ఇవాళ ఉన్న పోర్టులు రియల్ గా ఒక్కటి మెరుగైనది లేదు. ట్రాన్షిప్ పోర్టు ఒక్కటీ లేదు.

    ప్రపంచంలో మొత్తం జరిగే రవాణా రెండు మూడు ఇంటర్నేషన్ ట్రాన్షిప్ ద్వారానే జరుగుతాయి. చాలా పెద్ద షిప్స్ అవి. వాటిల్లో భారత్ లో ఒక్కటీ లేదు. దానికి డీప్ పోర్ట్స్ కావాలి.

    ప్రపంచంలో టాప్ 20 పోర్ట్స్ చూస్తే.. భారత్ లో ఒక్క పోర్టు కూడా లేదు. మన లార్జెస్ట్ పోర్ట్ 26వ ర్యాంకులో ఉంది. మొత్తం టాప్ 10లో ఆరు చైనాలో ఉన్నాయి. 9 ఆసియా ఖండంలో ఉన్నాయి.. ఒకటి లాస్ ఏంజెల్స్ లో ఉంది.

    లార్జెస్ట్ పోర్ట్ దేశంలో అదానీ ముంద్రా పోర్ట్. నౌకా రవాణా లో భారత్ ఎందుకు వెనకబడింది? అన్న దాని పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.