https://oktelugu.com/

Jharkhand elections 2024 : జార్ఖండ్ లో ఆదివాసులు ఎందుకు బీజేపీకి దూరమయ్యారు?

Jharkhand elections 2024: జార్ఖండ్ లో ఆదివాసులు ఎందుకు బీజేపీకి దూరమయ్యారు అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : November 2, 2024 / 12:55 PM IST

    Jharkhand elections 2024 : జార్ఖండ్ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. ఈసారి జార్ఖండ్ లో ఆదివాసీలు ఎందుకు బీజేపీకి దూరమయ్యారు.. ఆదివాసీలు ఎటువైపు ఉన్నారో తెలుసుకుందాం. జార్ఖండ్ లో మొత్తం సీట్లు 81. అందులో ఆదివాసీ సీట్లు 28. ఈ 32లో పోయినసారి బీజేపీకి వచ్చినవి కేవలం 2. ఈశాన్యంలోని సంతాల్ పరగణాస్. దిగువన సౌత్ ఈస్ట్ లో కోల్హామ్ రీజియన్లు ప్రధానమైనవి. ఒక దాంట్లో 14 (కోల్హామ్), ఇంకోదాంట్లో 18 సీట్లు (సంతాల్) ఉన్నాయి. మూడు ప్రధాన ఆదివాసీలు ముండా, కోల్హామ్, సంతాల్ ఉన్నాయి.

    పోయినసారి జేఎంఎం 19, కాంగ్రెస్ కు 6 సీట్లు వచ్చాయి. జార్ఖండ్ వికాస్ మోర్చాకు ఒక సీటు వచ్చాయి. పోయిన లోక్ సభ ఎన్నికల్లో చూస్తే 5 సీట్లకు 5 సీట్లు బీజేపీ ఓడిపోయింది. బీజేపీకి ఎందుకిలా జరుగుతుందో చూద్దాం.

    2014లో బీజేపీకి బ్రహ్మండమైన మెజార్టీ లభించి అధికారం వచ్చింది. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి సారి ఆదివాసీ కాని వ్యక్తికి ముఖ్యమంత్రి పీఠం ఇచ్చారు. రఘువీర్ దాస్ వంటి బీసీ లకు సీఎం సీటుకు ఇవ్వడం ఆదివాసీలకు కోపం వచ్చింది. రఘువర్ దాస్ పాలన అవినీతి తక్కువ అయినా వివాదాల్లో ఇరుక్కున్నారు. మైనింగ్ ఎక్కువన్న జార్ఖండ్ లో పరిశ్రమలు తీసుకురావాలని భూచట్టం చేసిన రఘువీర్ దాస్ పై ఆదివాసీలు ఆగ్రహించారు. ఆ తర్వాత ఎన్నికల్లో కేవలం 2 సీట్లకేబీజేపీని పరిమితం చేశారు.

    జార్ఖండ్ లో ఆదివాసులు ఎందుకు బీజేపీకి దూరమయ్యారు అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.