https://oktelugu.com/

Political Leaders : కొత్త రాజకీయ నాయకుల్లో ఎవరు సక్సెస్ ఎవరు ఫెయిల్

Political Leaders: కొత్త రాజకీయ నాయకుల్లో ఎవరు సక్సెస్ ఎవరు ఫెయిల్ అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : October 14, 2024 / 12:16 PM IST

    Political Leaders : రాబోయే రోజుల్లో కొత్త రాజకీయ నాయకులు ఎవరు సక్సెస్ కాబోతున్నారు. ఎవరినీ ఆసక్తిగా గమనించాలి.. ప్రస్తుతం ఉన్న నాయకుల్లో ఎవరు సక్సెస్ ఎవరు ఫెయిల్ నో తెలుసుకుందాం.

    అందరికంటే ప్రభావం చూపగల నంబర్ 1 నాయకుల్లో ‘అన్నామలై’ ముందు ఉంటారు. అతడు క్రియేట్ చేసిన ప్రభావం తమిళనాడులో ఏ ఒక్కరు సృష్టించలేదు. వచ్చే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించగలడు. పోయిన ఎన్నికల్లో 11 శాతానికి బీజేపీని తమిళనాడులో తీసుకొచ్చాడు. కనీసం ప్రతిపక్షంలోకి తీసుకురాగలడా? అధికారంలోకి రాగలడా? అన్నది చూడాలి.

    నంబర్ 2 చూస్తే పవన్ కళ్యాణ్ ఉంటారు. ఇప్పటికే ఆయన అధికారంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఇప్పటివరకూ పరిమిత ప్రాంతానికే నాయకుడిగా ఉన్నారు. ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలకే పరిమితమైన పవన్ కళ్యాణ్ కు ఎన్నికల తర్వాత విపరీతమైన పాపులారిటీ పెరిగింది. వచ్చే మూడు నాలుగు సంవత్సరాల్లో జనసేన ఏపీకి పార్టీగా అన్ని నియోజకవర్గాల్లో విస్తరించేస్థాయికి తీసుకెళ్లగలడా? సనాతన ధర్మంతో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమైన పవన్ రాజకీయ అడుగులు ఎలా పడుతాయన్నది ఆసక్తిగా మారింది.

    ఇక నంబర్ 3 ప్రశాంత్ కిషోర్.. బీహార్ రాజకీయాల్లో పీకే ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఓ కొత్త ఆలోచనతో ముందుకెళుతున్న ఈయన రాజకీయ అడుగులు ఆసక్తికరం..

    కొత్త రాజకీయ నాయకుల్లో ఎవరు సక్సెస్ ఎవరు ఫెయిల్ అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.