https://oktelugu.com/

TTD Board : తిరుమల దర్శనం రెండుమూడు గంటల్లో జరగాలంటే ఏం చేయాలి?

TTD Board: రాజకీయ నాయకుల జోక్యం అనేది ఉండకుండా తిరుమలలో దర్శనాల ఏర్పాటు చేయాలి. తిరుమల దర్శనం రెండుమూడు గంటల్లో జరగాలంటే ఏం చేయాలి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : November 19, 2024 / 08:40 PM IST

    TTD Board : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (బోర్డు ఆఫ్ ట్రస్టీస్ ) సమావేశం జరిగింది. ఇందులో భక్తుల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నింటికంటే ముఖ్యమైనది భక్తులు స్వాగతించేది ఏంటంటే.. ‘దర్శనం రెండు మూడు గంటల్లో పూర్తి చేయాలని’ బోర్డు అమలు చేయాలని చూస్తోంది. తిరుమల కొండపై దర్శనం గనుక ఎంత తొందరగా జరగగలిగితే వెంటనే వెళ్లిపోతారు. రద్దీ తగ్గుతుంది.. దాని కోసం ఏం చేయాలి? మేం ఏఐ సహాయం తీసుకుంటామని చెప్పారు.

    ఏఐ సహాయానికి ముందు చిత్తశుద్ధి కావాలి. అమలు చేయాలంటే చాలా సమస్యలు వస్తాయి.. ముఖ్యంగా ప్రతీ వాడికి ఒక స్టేటస్ సింబల్ ఉంటుంది. ప్రత్యేకంగా దర్శనాలు చేయిస్తే గొప్ప వ్యక్తులుగా మారిపోతారు. ఎంపీలు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి సిఫారసు లేఖలు.. వీఐపీ స్టేటస్ తో బోలెడన్నీ దర్శనాలు.. టూరిజంకు టికెట్లు కట్ చేయడం మంచి నిర్ణయం..

    రాజకీయ నాయకుల జోక్యం అనేది ఉండకుండా తిరుమలలో దర్శనాల ఏర్పాటు చేయాలి. తిరుమల దర్శనం రెండుమూడు గంటల్లో జరగాలంటే ఏం చేయాలి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.