By-Elections Results 2024 : ఉప ఎన్నికల ఫలితాలు మామూలుగా అయితే సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే నంబర్ చాలా ఎక్కువగా ఉంది. యూపీలో 9 స్థానాలు, రాజస్థాన్ లో 7 స్థానాలు, బీహార్ లో 4, జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. యూపీ, రాజస్థాన్, బీహార్ చూస్తే ఉప ఎన్నికల ట్రెండ్ ను అర్థం చేసుకోవచ్చు.
ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ రెండు సీట్లను బీజేపీ గెలుచుకుంది. మూడు సీట్లు రీటైన్ చేసుకుంటూ సమాజ్ వాదీ రెండు సీట్లను చేజిక్కించుకుంది. యూపీలోని ‘కుందర్కీ’ అనే అసెంబ్లీలో మెజార్టీ ముస్లింలు ఉన్నా.. అందరూ ముస్లిం అభ్యర్థులను పెట్టిన కూడ ఇక్కడ బీజేపీ గెలవడం విశేషం. ముస్లింలు ఇక్కడ బీజేపీకి ఓటు వేయడం గమనార్హం.
బీహార్ లో కూడా నాలుగు సీట్లు ఎన్నికలు జరిగాయి.. ఆర్జేడీ, వేరే కూటమికి సంబంధించనవి.. కానీ ఈ నాలుగు బీజేపీనే గెలవడం విశేషం. ఆర్జేడీకి అంటకాగే ముస్లింలు ఈసారి డీవియేట్ అయినట్టుగా అర్థమవుతోంది. యాదవులు కూడా ఆర్జేడీ వైపు లేకపోవడం ఇక్కడ గమనార్హం.
ఉప ఎన్నికల ఫలితాలు హిందీ రాష్ట్రాల్లో కీలక మార్పుల్ని సూచిస్తున్నాయి.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.