https://oktelugu.com/

Kamala Harris : కమలా హారిస్ ఓడిపోవడానికి కారణాలేంటి?

Kamala Harris : ఇప్పటివరకూ అమెరికాలో హిల్లరీ క్లింటన్ ఇదే ట్రంప్ పై ఓడిపోయింది. మళ్లీ కమలా హారిస్ కూడా ట్రంప్ మీదనే ఓడిపోయింది. ఈ ఇద్దరే అధ్యక్షుల స్థాయికి ఎదిగారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 8, 2024 / 11:59 AM IST

    Kamala Harris : నిన్నటి అమెరికా ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కువగా వినపడుతున్న మాట ఏంటంటే.. కమలా హ్యారిస్ మహిళ కాబట్టి ఓడిపోయింది. అమెరికా సమాజం మహిళ కాబట్టి అధ్యక్షురాలిగా ఆమోదించడం లేదు. ఇవీ బాగా వినపడుతున్నాయి. ఇదొక పాయింట్ గా ప్రచారం జరుగుతోంది.ఇందులో నిజమెంత?

    దీనికి సమాధానం అవును.. కాదు.. ఇంతవరకూ ఏ ఒక్క మహిళ కూడా అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నిక కాలేదు. ప్రపంచంలోనే మొట్టమొదటి రిపబ్లిక్. 1776లో స్వాతంత్ర్యం పొందిన అమెరికా రాచరికం లేకుండా ప్రజాస్వామ్యంతో పరిపాలన చేసుకుంటున్న దేశం. 1920 దాకా అమెరికాలో ఓటు హక్కునే లేదు. మహిళ కాబట్టే ఎన్నిక కాలేకపోతుందనడానికి సహేతుక కారణాలు కనిపించడం లేదు.

    ఇప్పటివరకూ అమెరికాలో హిల్లరీ క్లింటన్ ఇదే ట్రంప్ పై ఓడిపోయింది. మళ్లీ కమలా హారిస్ కూడా ట్రంప్ మీదనే ఓడిపోయింది. ఈ ఇద్దరే అధ్యక్షుల స్థాయికి ఎదిగారు.

    బరాక్ ఒబామా ఎన్నిక అయ్యేదాకా నల్లజాతీయులను అమెరికా సమాజం ఒప్పుకోదన్న తప్పు పోయింది. అంతకంటే బలమైన నాయకుడు వచ్చినప్పుడు ఒబామా కూడా ఓడిపోయేవాడు. కానీ కమలాహ్యారిస్ అంతటి బలమైన నేత కాకపోవడం.. యువతలో ఆమెకు ఒబామాలా క్రేజ్ లేకపోవడం మైనస్ గా మారింది.

    కమలా హారిస్ ఓడిపోవడానికి కారణాలేంటి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.