Waqf Bill : వక్ఫ్ సవరణ బిల్లుపై జరుగుతున్న చర్చ దేశంలో మరే బిల్లుపై జరగలేదు. ఈమెయిల్ లోనే 1.25 కోట్ల సలహాలు వచ్చాయి. అవన్నీ చూడడమే పెద్ద టాస్క్. ఇందులో కుట్రకోణం ఉందని ఫిర్యాదు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని రెండుగా విభజించాలి. ఒకటి ఈ చర్చలో వక్ఫ్ బిల్లు అనేది ఎందుకు ఉండాలి.
మనది సెక్యూలర్ రాజ్యం అని చెబుతూ.. ఇస్లాం రాజ్యంలో ఉండే వక్ఫ్ చట్టాన్ని భారత్ లో ఎందుకు అమలు చేయాలి? ఇస్లాం రాజ్యంలోనూ ఈ చట్టం లేదు. ఇరాన్, ఈజిప్ట్ సహా చాలా ముస్లిం దేశాల్లో వక్ఫ్ చట్టాలు లేవు.
క్రిస్టియన్ మిషనరీలు, ట్రస్టుల కింద చర్చీలు, ఆస్పత్రులున్నాయి. హిందువులకు ఆస్తులన్నీ భారతీయ చట్టాల కింద ఉన్నాయి. మరి ముస్లింలకు ఎందుకు ఈ ప్రత్యేక చట్టం ఉండాలి? అన్నది ఇప్పుడు ప్రశ్న.
శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం? పొందుతుందా? లేదా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.