Kerala Politics : కేరళ సమాజం రాజకీయ చర్చలు పెట్టడంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు ఉంటుంది. శబరిమల వివాదం పై కేరళలో విస్తృతమైన చర్చ జరిగింది. ప్రతీ రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని తీసుకున్నారు. ఇష్యూ కాదనుకున్న సీపీఎం చివరకు దిగొచ్చి తన సెంటిమెంట్ పక్కనపెట్టి హిందూ సమాజాన్ని గౌరవిస్తూ నిర్ణయం తీసుకుంది. చివరకు సీపీఎంను రాజకీయ చర్చ తలొగ్గేలా చేసింది.
ఇప్పుడు వక్ఫ్ చట్టంపై రాజకీయ చర్చ విస్తృతంగా కేరళలో జరుగుతోంది. ఈ స్థాయిలో జరుగుతుందని ఎవ్వరూ ఊహించరు. ఎందుకని ఇంతటి చర్చ అని చూస్తే.. ప్రధానంగా వక్ఫ్ చట్టం సవరణ సమయంలోనే మునంబం,చెరాయ అనే గ్రామాల్లో వక్ఫ్ చట్టం కింద నోటీసులు ఇవ్వడంతో 600 కుటుంబాల పరిస్థితి గందరగోళంగా మారింది. దీంతో కేరళ అసెంబ్లీలో ఒక వక్ఫ్ చట్టంపై తీర్మానం చేశారు. వక్ఫ్ చట్టాన్ని కేంద్రం ఉపసహరించుకోవాలని కేరళలోని అసెంబ్లీలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఏకగ్రీవ తీర్మానం చేశాయి. వక్ఫ్ చట్టం ఉపసంహరించాలని ఒక రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఎల్డీఎఫ్, యూడీఎఫ్ రాజకీయ వాదాన్ని కేరళ ప్రజలు గ్రహించారు. రాజకీయ వాదం కోసం ముస్లింలకు ఈ పార్టీలు కొమ్ముకాస్తున్నాయని కేరళలోని ఇతర వర్గాల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ చర్య ప్రతి ఒక్కరిని కదిలించింది.
కేరళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న వక్ఫ్ చట్టం పరిణామాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.