Waqf Act Amendments : వక్ఫ్ చట్ట సవరణ బిల్లు అంతిమదశకు చేరుకుంది.వక్ఫ్(సవరణ)బిల్లును 2024, ఆగస్టు 8న కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. దేశంలోని వక్ఫ్ ఆస్తిని కేంద్రం నియంత్రిస్తుంది. ముస్లింలకు చట్ట ప్రకారం పవిత్రమైన, మతపరమైన లేదా స్వచ్ఛందంగా పరిగణించబడే ప్రయోజనాలను కోసం వక్ఫ్‌ను ఏర్పాటు చేశారు. అయితే వక్ఫ్ ముసుగులో భూములన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి. సొంతానికి వాడుకుంటున్నారు. అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే కేంద్రం వక్స్ సవరణ బిల్లును తేవాలని నిర్ణయించింది. ఆగస్టు 8న దీనిని లోక్‌సభలో ప్రవేశపెట్టగా విపక్షాలు వ్యతిరేకించాయి. ఈ బిల్లును ముందుగా జేపీసీకి ఇవ్వాలని డిమాండ్ చేశాయి. అయితే వక్ఫ్ చట్ట సవరణకు కట్టుబడి ఉన్న మోదీ, అమిత్‌షా.. విపక్షా కోరిక మేరకు బిల్లును జేపీసీకి కేటాయించారు. ఇందులో బీజేపీ ఎంపీ చైర్మన్‌గా, విపక్షాల ఎంపీలు సభ్యులుగా ఉన్నారు.
వక్ఫ్ చట్ట సవరణ బిల్లు అంతిమదశకు చేరుకుంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ చాలా విస్తృతమైన చర్చ జరిపింది. రెండు మూడు కేంద్రాల్లో ఇంకా చర్చలు పెట్టాల్సి ఉంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో సవరణ బిల్లు తీసుకురావాలని కేంద్రప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
ఆంధ్రాలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు తెలుగుదేశం, జనసేనలు ఎటువైపు ఉన్నాయి.? పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టినప్పడు ఎల్జేపీ, టీడీపీ, జనసేన సహా అన్ని పార్టీలు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అప్పగించి చర్చించాలని కోరడంతో మోడీ సర్కార్ ఒప్పుకొని చర్చకు పెట్టింది.
ఈ బిల్లు మీద ఏదో ఒక స్టాండ్ తీసుకోవాల్సిన ఆవశ్యకత తెలుగుదేశం, జనసేనకు వచ్చింది.లక్షలాది కోట్ల రూపాయల ఆస్తులు కొద్దిమంది చేతుల్లో ఉంది. వందల కోట్ల ఆదాయం ఎటుపోతోంది.? సామాన్య ముస్లిం కుటుంబాలకు అసలు ఖర్చు పెట్టడం లేదు. కొన్ని దశాబ్ధాలుగా దోచుకుంటున్న కొంతమందికి ఇది చెక్ పడుతుంది. జవాబుదారీ, పారదర్శకత పెరుగుతుంది..
ఆస్తులు ఎన్ని? ఆదాయం ఎంత వస్తుంది అన్నది ఈ వక్ఫ్ బిల్లుతో బయటకు వస్తుంది. ముస్లింలకు ఆదాయం ఖర్చు పెడుతున్నారా? లేదా? అన్నది బయటకొస్తుంది.
వక్ఫ్ చట్ట సవరణలు సామాన్య ముస్లింలకు మేలు చేస్తాయి.. దీనిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.