https://oktelugu.com/

Industrial Park : 200కి పైగా విదేశీ కంపెనీల్ని ఆకర్షిస్తున్న ప్రైవేట్ పారిశ్రామిక పార్కు గురించి తెలుసుకుందామా?

Industrial Park: తెలుగు రాష్ట్రాల్లో గర్వంగా చెప్పుకోవడానికి పారిశ్రామికపార్కులు ఉన్నాయా? తెలుసుకుందాం.. 200కి పైగా విదేశీ కంపెనీల్ని ఆకర్షిస్తున్న ప్రైవేట్ పారిశ్రామిక పార్కు గురించి ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : October 24, 2024 / 11:18 AM IST

    Industrial Park : కేంద్ర ప్రభుత్వం ఇటీవల 12 కొత్త పారిశ్రామిక పార్కులను ఆమోదించింది. అందులో రెండు ఆంధ్రప్రదేశ్ కు కేటాయించింది. కడప జిల్లా, కర్నూలు జిల్లాలో పెట్టింది. ఇంకోటి తెలంగాణలోని జహీరాబాద్ లో పెట్టింది. పారిశ్రామిక ప్రాంతాలను కేంద్రమే డెవలప్ చేస్తోంది. కొన్ని షెడ్స్ కడుతుంది. సబ్సిడీలు ఇస్తుంది. మొత్తం దేశంలో అత్యంత పెద్ద పారిశ్రామికప్రాంతం అదానీది.. ముంద్రా పారిశ్రామికపార్క్ ఉంది.

    నగరాల పక్కన ఉన్నటువంటి పారిశ్రామికపార్క్ లు ఎక్కువగా డెవలప్ అవుతుంటాయి. ఢిల్లీ పక్కన పారిశ్రామికప్రాంతం చాలా అభివృద్ధి చెందింది. ఇక బాగా పాపులర్ అయ్యింది మాత్రం హోసూరు. తెలుగువారు నివసించే తమిళనాడులోని ప్రాంతం. బెంగళూరుకు దగ్గరగా ఉంది. హోసూరు ప్రజలు అంతా తెలుగువారే.. ఆటోమొబైల్ , ఎలక్ట్రానిక్ మాన్యూఫాక్చరింగ్ బాగా డెవలప్ అయ్యింది.

    తెలుగు రాష్ట్రాల్లో గర్వంగా చెప్పుకోవడానికి పారిశ్రామికపార్కులు ఉన్నాయా? తెలుసుకుందాం.. 200కి పైగా విదేశీ కంపెనీల్ని ఆకర్షిస్తున్న ప్రైవేట్ పారిశ్రామిక పార్కు గురించి ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.