Pawan Kalyan Senatho Senani : జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత అత్యంత విలువైన సమావేశం ఏదైనా ఉందంటే.. తాజాగా ముగిసిన విశాఖ ప్లీనరీ సమావేశం. ఇది ఎప్పటిలాగా బహిరంగ సమావేశం కాదు.. కేవలం పార్టీ ప్రతినిధులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ క్రియాశీల కార్యకర్తలు ఎక్స్ క్లూజివ్ గా జరుపుకున్న సమావేశం.. మూడోరోజు జరిగింది కార్యకర్తల ప్లీనరీ సమావేశం.
ఈ సమావేశం ఎందుకు చరిత్రలో నిలిచిపోతుందంటే.. జనసేన నిర్మాణంపై దృష్టి సారించిన సమావేశం. మొట్టమొదటిసారి జరిగిన ఈ విస్తృత పార్టీ కార్యకర్తల సమావేశం. బాటమ్ టు టాప్ సమావేశం. కార్యకర్తలే మాట్లాడినటువంటి సమావేశం. వేదికపై పెద్దలు శ్రద్ధగా విన్నారు.
గత 11 ఏళ్లు పార్టీని గుండెల్లో పెట్టుకొని మాట్లాడిన కార్యకర్తలకు ఈ సభతో గుర్తింపు దక్కింది. కార్యకర్తలే నాయకులు అయితే ఎలా ఉంటుందో చూపించిన సమావేశం. చెంచు యువకుడు శివ, అరకు నుంచి చెట్టిన్యాల, పశ్చిమ గోదావరి నుంచి మహిళ, వీరమహిళల ప్రసంగాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
విశాఖ ప్లీనరీ జనసేనకు పవన్ కళ్యాణ్ కు ఓ గేమ్ ఛేంజర్. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
