Pawan Kalyan : బంగ్లాదేశ్ లో ఎప్పుడూ జరగనటువంటి కొత్త పరిణామం ఇటీవల చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ లో 1947 నుంచి హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. . స్వాతంత్ర్యం వచ్చాక బంగ్లాదేశ్ లో 1951 నాటి జనాభా లెక్కల్లో హిందువులు 22 శాతం.. 2011కి 8.5 శాతం.. ఇప్పటికి 7 శాతానికి తగ్గొచ్చు. ఇది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది.
ముఖ్యంగా బంగ్లాదేశ్ లో ఈ పరిణామాలకు కాంగ్రెస్ కూడా బాధ్యురాలే. కాంగ్రెస్ ను నిందించాల్సిన అవసరం ఉంది. 1947 విభజన తర్వాత పాక్ నుంచి.. హిందువులు రావడానికి ప్రయత్నిస్తే అడ్డుకొని వద్దని చెప్పింది ఆ నాటి కాంగ్రెస్ పార్టీ. గాంధీజీ కూడా ఈ విషయంలో తప్పు చేశాడు. తప్పులు చేసిన మాట నిజం. 1947 అంబేద్కర్ ఓ పుస్తకం రాసి దీనిపై రాశాడు. గాంధీ, నెహ్రూ పని గట్టుకొని హిందువులు రావద్దని పిలుపునిచ్చారు.అప్పుడే మారణహోమం జరిగింది.
బంగ్లాదేశ్ లో నెహ్రూ, పాక్ ప్రధాని లియాఖత్ అలీలు కలిసి పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడున్న హిందువులకు రక్షణ కల్పించాలని ఒప్పందం చేసుకున్నారు. 1946లో డైరెక్ట్ యాక్షన్ పేరుతో కోల్ కతాలో వేలాది హిందువులను మహ్మద్ అలీ జిన్నా ఊచకోత కోసింది వాస్తవం. అప్పుడు కోల్ కతాలో అప్పుడు ముస్లిం లీగ్ రాష్ట్ర ప్రభుత్వమే అధికారంలో ఉంది. పాకిస్తాన్ గా ఏర్పడ్డాక అక్కడి ప్రభుత్వం ఎలా రక్షణ కల్పిస్తుంది.. ఇది హిందువులను దగా మోసం కాదా? దీన్నే శ్యాం ప్రసాద్ ముఖర్జీ నినదించాడు.
బంగ్లాదేశ్ లో సాధు-సంత్ సమాజ్ ఆధ్వర్యంలో హిందువుల ఐక్యతపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.