Jamili Elections : జమిలీ ఎన్నికలు వస్తున్నాయి.. ఎవ్వరూ ఊహించని విధంగా జమిలీ ఎన్నికలకు ఆమోదం తెలిపారు. ఇవ్వాల్టికి ఇవ్వాళ వచ్చినా కూడా ఐదేళ్ల తర్వాతనే. ఆ ప్రక్రియ ఇప్పుడు మొదలైంది. రాంనాథ్ కోవింద్ అధ్యక్షతన సెప్టెంబర్ 2023లోనే హైలెవల్ కమిటీని ఏర్పాటు చేశారు. అది ఇటీవల రిపోర్ట్ ఇచ్చింది. 47 రాజకీయ పార్టీలను సంప్రదించగా.. 37 పార్టీలు ఆమోదించగా.. 15 పార్టీలు ఒప్పుకోలేదని నివేదికలో పేర్కొన్నారు.
రెండు దఫాలుగా దేశంలో ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంట్ అసెంబ్లీకి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు.. అది అయిపోయాక 100 రోజులకు స్థానిక సంస్థల ఎన్నికలు.. ఇవి అయిపోతే మిగతా నాలుగున్నరేళ్లు ఎన్నికలు లేకుండా అభివృద్ధి పనులు చేసుకోవచ్చు.
అసెంబ్లీలు పడిపోతే ఏం చేయాలన్నదానిపై రిపోర్టులో పేర్కొన్నారు. మధ్యంతర ఎన్నికలు పెట్టి మళ్లీ సార్వత్రిక ఎన్నికలతోనే కొనసాగిస్తారు.
రాజ్యాంగ సవరణలు ఆమోదమే అత్యంత క్లిష్టం.. జమిలీ ఎన్నికలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.