Pinarayi Vijayan : ఒకసారి గెలిస్తే రెండోసారి వాళ్లు కేరళలో గెలవరు.. కానీ ఆ రికార్డును పినరయి విజయన్ బ్రేక్ చేసి రెండోసారి సీఎం అయ్యి కేరళ రాజకీయాల్లో సంచలనంగా మారారు. ఆయనకు తిరుగులేదని అనుకున్నారు. కానీ విజయన్ కు అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి.
నిన్నటి లోక్ సభ ఎన్నికల తర్వాత విజయన్పై ముప్పేట దాడి జరుగుతోంది.ఇటీవల ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ఘోర పరాజయం పాలైంది. అసెంబ్లీలో బాగా సీట్లు సంపాదించిన ఎల్డీఎఫ్.. లోక్ సభలో మాత్రం ఒక్కటే ఎంపీ సీటు గెలిచింది. అదీ 20వేల మెజార్టీతోనే.. ఘోర పరాజయంగా చెప్పొచ్చు.
సీపీఎం కేరళ పార్టీ అంటే హిందువుల పార్టీగా చెబుతారు. కోర్ ఓటు బేస్ గా యజవాష్ కులస్థులు ఉన్నారు. త్రిసూర్ లో సురేష్ గోపీ గెలవడంలో కూడా యజవాష్ లు కీలకంగా ఉన్నారు.
చిక్కుల్లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.